వెంకటేష్ వల్ల రెండు రోజులు భోజనం చేయని శ్రీవిష్ణు.. ఏమైందంటే?

శ్రీవిష్ణు నటించిన రాజరాజచోర సినిమా ఈ నెల 19వ తేదీన థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.సినిమా రిలీజ్ కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో శ్రీవిష్ణు ప్రమోషన్ల విషయంలో వేగం పెంచారు.

 Sri Vishnu Talks At Rajarajachora Pre Release Event Details Here, Interesting D-TeluguStop.com

శ్రీవిష్ణుకు జోడీగా మేఘా ఆకాష్ ఈ సినిమాలో నటిస్తుండగా హసిత్ గోలి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీవిష్ణు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను స్టార్ హీరో వెంకటేష్ కు వీరాభిమానినని నారప్ప మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం తనను ఎంతగానో బాధ పెట్టిందని చెప్పారు.ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినందుకు రెండు రోజులు భోజనం కూడా చేయలేదని శ్రీవిష్ణు అన్నారు.

రాజరాజచోరలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే మాత్రమే పెద్ద సినిమాలు రిలీజయ్యే అవకాశం ఉంటుందని శ్రీవిష్ణు చెప్పుకొచ్చారు.చిన్న సినిమాలకు ఆదరణ దక్కితే సూపర్ స్టార్ల సినిమాలను సిల్వర్ స్క్రీన్ పై చూడగలమని విష్ణు పేర్కొన్నారు.

మహిళలకు ఈ సినిమా తర్వాత తాను చాలా బాగా గుర్తుండిపోతానని శ్రీవిష్ణు తెలిపారు.

Telugu Megha Akash, Rohith, Ppa Ott, Pre, Raja Raja Chora, Rajarajachora, Tollyw

ప్రేక్షకులను ఈ మూవీ మరో కొత్తలోకంలోకి తీసుకెళుతుందని రిలీజైన తర్వాత ఈ సినిమా ప్రతి భాషలో రీమేక్ అవుతుందని శ్రీవిష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు.దర్శకుడు అనిల్ రావిపూడి శ్రీవిష్ణు కథల సెలక్షన్ బాగుందని రాజరాజచోర శ్రీవిష్ణు కెరీర్ లో బెస్ట్ మూవీ కావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

Telugu Megha Akash, Rohith, Ppa Ott, Pre, Raja Raja Chora, Rajarajachora, Tollyw

నారా రోహిత్ తాను ఈ సినిమాను చూశానని ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.డైరెక్టర్ హసిత్ గోపీ ఈ సినిమాలో కొంటె శ్రీవిష్ణును చూస్తారని తాను కూడా శ్రీవిష్ణుకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు.రాజరాజచోరతో శ్రీవిష్ణుకు సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube