Srisatya Biggboss : నా కూతురు జెన్యూన్..శ్రీసత్య తండ్రి ఓపెన్ కామెంట్స్ వైరల్!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లోకి శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అర్జున్ కళ్యాణ్ ఇటీవలే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే.

 Sri Satya Father Reacts On Arjun Kalyan And Sri Satya Relationship In Bigg Boss-TeluguStop.com

అయితే బిగ్ బాస్ హౌస్ లో శ్రీ సత్య,అర్జున్ కళ్యాణ్ చనువుగా ఉండడంతో వారిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ అనేక రకాల వార్తలు వినిపించాయి.ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ సత్య తండ్రి శ్రీనివాస ప్రసాద్ వారిద్దరి రిలేషన్ గురించి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య ఒకే రంగంలో ఉన్నారు అందువల్లే వారిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పుకొచ్చాడు శ్రీనివాస ప్రసాద్.

అర్జున్ కళ్యాణ్ తనకు స్నేహితుడు అయ్యాడు అన్న విషయం శ్రీ సత్య బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళకముందే చెప్పింది అని తెలిపారు శ్రీనివాస ప్రసాద్.ప్రస్తుత రోజుల్లో పరిస్థితిలు ఏవిధంగా ఉన్నాయి అంటే,రోడ్డుమీద అన్నా చెల్లెలు వెళ్తుంటే వాళ్ళు అన్నాచెల్లెళ్ల, లవర్సా అన్నది తెలుసుకోకుండానే ఎవడో ఒకడు ఏదో ఒక రకమైన కామెంట్ చేస్తూనే ఉంటాడు.

అలానే అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య మధ్య రాపో చూసి కొన్ని ఛానల్ వాళ్ళు ఆ విధంగానే రాశారు అని తెలిపాడు శ్రీనివాస్ ప్రసాద్.వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్.

Telugu Arjun Kalyan, Bigg Boss, Relationship, Sri Sathya-Movie

శ్రీ సత్య తల్లి గురించి అర్జున్ కళ్యాణ్ కు బాగా తెలుసు కాబట్టి నేను చూసుకుంటాను అని తెలిపాడు.ఆ విషయాన్ని కూడా కొన్ని ఛానల్ వాళ్ళు రేటింగ్స్ కోసం ఏదేదో చెప్పుకుంటూ రాసుకొని వచ్చారు.కానీ అర్జున్ కళ్యాణ్ చాలా మంచి అబ్బాయి అని వెల్లడించారు శ్రీనివాస ప్రసాద్.మరి శ్రీ సత్య, నా క్రష్ అని అర్జున్ కళ్యాణ్ చెప్పారు కదా ఆ విషయం ఏంటి అని సదరు యాంకర్ ప్రశ్నించగా.

అలా ఎందుకు చెప్పాడు నాకు తెలియదు కానీ నాకు తెలిసి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సే అంటూ క్లారిఫికేషన్ ఇచ్చాడు.అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో అర్జున్ అలా అన్నాడో లేకపోతే అలా అనిపించారో అన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు శ్రీ సత్య తండ్రి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube