నేను డబ్బు బాగా ఖర్చు పెడుతా.. నా బాయ్ ఫ్రెండ్ తిండిబోతు: శృతి హాసన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుందీ.

 South Actress Shruthi Hasan Reveals That She Proposed First To Her Boy Friend De-TeluguStop.com

అంతే కాకుండా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉంటుంది.

తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

ఈమె గత కొంత కాలంగా శాంతనుహజరికా తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.ఇక శృతి హాసన్ తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో పలు సార్లు వైరల్ గా కూడా మారాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ లవ్ బర్డ్స్ కలిసి సోషల్ మీడియాలో క్విజ్ లో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు.

ఈ సందర్భంగా శృతిహాసన్ తన ప్రియుడికి ఆమె మొదట ఐ లవ్ యూ చెప్పినట్లు తెలిపింది.గత రెండు సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నట్లు గత ఏడాది సోషల్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఎవరు బాగా డబ్బు ఖర్చు పెడతారు అన్న ప్రశ్నకి నేనే అంటూ శృతిహాసన్ సమాధానమిచ్చింది.అలాగే ఎవరు బాగా తింటారు అన్నదానికి తన బాయ్ ఫ్రెండ్ వైపు వేలు చూపిస్తూ నా బాయ్ ఫ్రెండ్ తిండిబోతు అన్నట్టుగా సమాధానమిచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ క్విజ్ ఈ లవ్ బర్డ్స్ ఎంతో సంతోషంగా సరదాగా పాల్గొన్నారు.ఇక ఈమె తెలుగులో క్రాక్, రేసుగుర్రం, ఎవడు, గబ్బర్ సింగ్, శ్రీమంతుడు ఇలా మంచి మంచి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube