ఈ ఒక్క ఉంగరంతో ఎన్నో లాభాలు.. సంపూర్ణ ఆరోగ్యం గురించి చిటికెలో తెలియజేస్తుందిలా

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతోంది.ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అత్యాధునిక పరికరాలు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి.

 So Many Benefits With This One Ring.. Perfect Health In A Pinch ,ring, Health-TeluguStop.com

ఇదే కోవలో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ కంపెనీ Movano Health ఓ అద్భుతమైన రింగ్‌ను రూపొందించింది.ఇది వాడే మహిళలకు వారి సంపూర్ణ ఆరోగ్యం గురించి వివరాలు తెలియజేస్తుంది.

హృదయ స్పందన రేటు, హృదయ స్పందనలో మార్పులు, శ్వాసక్రియ రేటు, చర్మ ఉష్ణోగ్రత వైవిధ్యం, పీరియడ్స్ ట్రాకింగ్, ఋతు లక్షణాల ట్రాకింగ్, బర్న్ చేయబడిన కేలరీలు, నిద్ర, మూడ్ ట్రాకింగ్ వంటి విషయాలను ఈ రింగ్ తెలియజేస్తుంది.ఈ డేటా మొబైల్ యాప్ ద్వారా మహిళలకు తెలుపుతుంది.

ఫలితంగా ఇది మహిళల జీవనశైలి మార్పులను స్పష్టంగా తెలియజేసి, వారి ఆరోగ్యానికి అవసరమైన సాయం చేస్తుంది.

Movano Health తయారు చేసిన ఉంగరం నిద్ర నాణ్యత, మహిళల ఋతు చక్రంలోని ట్రెండ్‌లలోని నమూనాలను గుర్తించడంలో సహాయపడుతుంది.

ఇందుకు మెడికల్ గ్రేడ్ హృదయ స్పందన రేటు, SpO2 డేటాను ఉపయోగించుకుంటుంది.

ప్రతి స్త్రీకి ఈ రింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.స్త్రీల సమస్యలను గుర్తించి, పరిష్కారం కోసం సహాయపడుతుంది.శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మహిళలను ప్రోత్సహిస్తుంది.

మహిళలు వారి మొత్తం ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి, సమస్యల పరిష్కారానికి Evie స్మార్ట్ రింగ్‌ను ఉపయోగపడుతుంది.ఇది పాలిష్ చేసిన అల్యూమినియంతో తయారు చేయబడింది.మూడు వేర్వేరు ఫినిషింగ్‌లలో వస్తుంది.రింగ్ 5-11 పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది.

దాని ఓపెన్ డిజైన్ సౌకర్యవంతంగా సరిపోయేలా చేస్తుంది.అదనపు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు లేకుండా స్మార్ట్ రింగ్ ధర 300 డాలర్ల కంటే తక్కువగా ఉంటుందనే అంచనా ఉంది.

ఇక ఈ రింగ్ 2023లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube