తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సిరి హనుమంత్( Siri Hanuman ) బాగా పరిచయం పెంచుకుంది.ఈమె ఒక యాంకర్ గా, నటిగా కంటే బిగ్ బాస్ హౌస్ లో తన పరిచయాన్ని పెంచుకుంది.
ఈమె తొలిసారిగా తన కెరీర్ ను యాంకర్ గా మొదలు పెట్టింది.అంతేకాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ లలో కూడా నటించింది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.
సిరి మొదటిసారి ఉయ్యాల జంపాల సీరియల్ తో నటిగా పరిచయమైంది.
ఇక ఈ సీరియల్ ( Serial )తనకు మంచి గుర్తింపు ఇవ్వడంతో ఆ తర్వాత మోహిని, అగ్నిసాక్షి వంటి పలు సీరియల్స్ లలో అవకాశాలు అందుకొని అందులో కూడా మంచి పాత్రలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.కేవలం బుల్లితెర పైనే కాకుండా యూట్యూబ్ లలో కూడా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరిస్( Short films, web series ) లు కూడా చేసింది.
ఈమె మరో ఆర్టిస్ట్ శ్రీహాన్ తో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.అతడు కూడా యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
అతడు కూడా బిగ్ బాస్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ఇక వీరిద్దరూ కలిసి చాలా వీడియోస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక ఈ హోదాతోనే గతంలో సిరి కి, శ్రీహాన్ కి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది.
అయితే సిరి మాత్రం తనకున్న అభిమానాన్ని మొత్తం బిగ్ బాస్ ద్వారా కోల్పోయింది.ఎందుకనేది.అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.
సిరి హౌస్ లో ఉన్నంతకాలం మరో కంటెస్టెంట్, యూట్యూబర్ షణ్ముఖ్ తో బాగా రెచ్చిపోయింది కాబట్టి.ఫ్రెండ్షిప్ అనే పేరుతో అతడికి హగ్గులు, కిస్ లు ఇచ్చి బాగా రచ్చ చేసి నెగెటివిటీ సంపాదించుకుంది.
దీంతో అందరూ తనపై బాగా ఫైర్ అయ్యారు.అప్పటికే ఆమె శ్రీహన్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఆమె అలా ప్రవర్తించడంతో అందరూ తనని ద్వేషించుకున్నారు.ఇప్పటికీ ఆమె అంటే అంత అభిమానం చూపించలేకపోతున్నారు జనాలు.
ఏదో ఒక విషయంలో ఆమెను బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మ’ అనే ఈవెంట్ లో యాంకర్ రవితో పాటు తను కూడా యాంకరింగ్ చేస్తూ కనిపించింది.
ఇక ఇందులో సీరియల్ నటీనటులంతా పాల్గొని బాగా సందడి చేస్తూ కనిపించారు.అయితే అందులో ఒక ఫిమేల్ ఆర్టిస్ట్ వరలక్ష్మివ్రతం( Varalakshmi Vratam ) అని తెలుసు అని అనటంతో వెంటనే సిరి ఇది వరలక్ష్మి వ్రతం కాదు శ్రావణమాసం ఈవెంట్ అని అనటంతో వెంటనే శ్రావణమాసంలోని వరలక్ష్మీ వ్రతం చేస్తారు పిచ్చి అని తిరిగి కౌంటర్ వేసింది.అంతేకాకుండా మధ్య మధ్యలో సిరి బాగా అతిగా ప్రవర్తించింది కూడా.దీంతో ఈ ప్రోమో చూసిన వాళ్లంతా సిరి అతి పై బాగా ఫైర్ అవుతున్నారు.శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం చేస్తారన్న విషయమే తెలియనప్పుడు అదే ఈవెంట్ కి యాంకరింగ్ ఎందుకు చేస్తుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.