ఆ పని చెయ్యని రోజే మనం ఆనందంగా ఉంటాం.. శ్రీహాన్ పోస్ట్ వైరల్!

సోషల్ మీడియా జంట సిరి హనుమంతు, శ్రీహాన్ ల గురించి మనందరికీ తెలిసిందే.వీరిద్దరు యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ ద్వారా వాళ్లు మంచి గుర్తింపు సంపాదించు కున్నారు.

 Siri Hanmanth Lover Shrihan Emotional Post, Siri Hanmanth, Srihan, Emotional Pos-TeluguStop.com

అదే గుర్తింపుతో సిరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సిరి బాగా ఫేమస్ అయి పోయింది.

అంతే కాకుండా బోలెడంత నెగిటివిటిని కూడా మూట కట్టుకుంది.సిరి బిగ్ బాస్ లో ఉన్న సమయంలో ఆమె ప్రియుడు శ్రీహాన్ బిగ్ బాస్ స్టేజీ పైకి వచ్చి మెరిసిన విషయం తెలిసిందే.

ఎప్పుడైతే శ్రీహన్ బిగ్ బాస్ స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చాడో  అప్పటి నుంచి అతని ఫాలోయింగ్, క్రేజ్ మరొక రేంజ్ కి వెళ్లింది.శ్రీహాన్ బిగ్ బాస్ స్టేజ్ పై మాట్లాడిన కొన్ని మాటలు అతని క్రేజ్ ని మరొక రేంజ్ కి తీసుకెళ్లాయి.

అతను మాట్లాడిన మాటలకు అభిమానులు ఫిదా అయ్యారు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సిరి తన ప్రియుడు శ్రీహాన్ గురించి ఏదో ఒకటి చెబుతూ ఉండేది.

శ్రీహాన్ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అంటూ తలచుకుంటూ ఉండేది.ఇక సిరి బిగ్ బాస్ లో షణ్ముఖ్ జస్వంత్ తో కలసి చేసిన రొమాన్స్ పెద్ద దుమారమే లేపింది.

షణ్ముఖ్ , సిరి లు బిగ్ బాస్ హౌస్ లో హగ్గులు, కిస్సు లతో రెచ్చిపోయారు.

దీనితో దెబ్బకు రెండు ప్రేమ జంటలు విడి పోయాయి.ఇక షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునయన ఏకంగా సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ అని చెప్పేసింది.సిరి, శ్రీ హన్ లు విడిపోతున్నారు అని వార్తలు వినిపించినా అప్పటికీ, ఇటీవల వీరిద్దరు యాంకర్ రవి ఇంట్లో కలిసి కనిపించే సరికి వారిద్దరూ విడిపోలేదు అని అందరికీ అర్థం అయింది.

కానీ బయట మాత్రం వీరిద్దరూ ఎక్కడ కలిసి కనిపించడం లేదు.ఇదిలా ఉంటే తాజాగా శ్రీహాన్ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశాడు.ఆ పోస్టులో అసలైన ఆనందం గురించి చెబుతూ వచ్చాడు.ఇతరులతో పోల్చుకోవడం మానేసిన రోజు అసలైన ఆనందాన్ని చూస్తారు.

మీరు మీలా ఉండండి అంటూ శ్రీహాన్ ఆ పోస్టులు రాసుకొచ్చాడు.మరి శ్రీహాన్ ఆ పోస్ట్ ని ఎవరిని ఉద్దేశించి చేశాడు.

ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం ఏమి? సందర్భం ఏమిటి అన్నది అర్థం కాక? అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube