షన్నుతో లోపల ఎలా ఉన్నానో, బయట అలానే ఉంటా.. ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేదు: సిరి

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ షో ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే.ఈ సీజన్ లో ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకులు బిగ్ బాస్ 5 ని చీదరించుకున్నారు.

 Shanmukh Jaswanth, Siri Hanmanth, Bigg Boss Telugu 5, Emotional-TeluguStop.com

అందుకు గల కారణం షణ్ముఖ్ జశ్వంత్, సిరి.వీళ్లు బిగ్ బాస్​ను కాస్త హగ్ బాస్ గా మార్చేశారు.

వీరు ఎపిసోడ్ ఎపిసోడ్ కి హగ్గులు, కిస్ లతో రెచ్చిపోయారు.ఒకటి కాదు,రెండు కాదు గ్రాండ్ ఫినాలే వరకు హగ్,రొమాన్స్ లతో హౌస్ ని హీటెక్కించారు.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత వారు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అనేశారు.షణ్ముఖ్ జశ్వంత్ టైటిల్ తో పాటు తన క్యారెక్టర్ ని కూడా కోల్పోయాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తాజాగా సిరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.ఇందులో తనపై జరుగుతున్న నెగిటివిటీని చూసి ఎమోషనల్ అయింది.

యూట్యూబ్ ఛానల్ లో కూడా పదేపదే సిరి, షణ్ముఖ్ హగ్గుల పైనే ప్రశ్నలు వేయడంతో అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.ఇక సదరు యాంకర్ ఆమెను బ్రతిమలాడి మళ్ళీ తీసుకువచ్చి అక్కడ కూర్చోబెట్టింది.

అప్పుడు సిరి తన బాధలు చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యింది.సిరి మాట్లాడుతూ.

హగ్ ఇష్యూలపై తన తల్లి వచ్చి అలా హగ్గులు చేసుకోకూడదు అని చెప్పారు.అప్పుడు మా అమ్మకు మా ఉద్దేశం అది కాదు అని చెప్పాను.

అప్పుడు అమ్మ కూడా అర్థమైందని తెలిపింది.ఆ తర్వాత అమ్మ చెప్పిన దానిపై నేను, షణ్ముఖ్ డిస్కషన్ చేసుకోగా మా ఇద్దరికీ క్లారిటీ వచ్చేసింది.

Telugu Siri Hanmanth-Movie

ఇక అమ్మ చెప్పిన తరువాత నేను నా పద్ధతిని మార్చుకుని ఉంటే అప్పటివరకు నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నట్టే.నేను ఆడియన్స్ తో డైరెక్టుగా చెప్పినట్టు నేను తప్పు చేశాను మా అమ్మ వచ్చి సరిదిద్దారు అని అది నాకు ఇష్టం లేదు.అని తెలిపింది సిరి.ఇకపోతే నాపై వస్తున్న కామెంట్స్ నేను చూడలేకపోతున్నాను.నా లైఫ్ లో ఎప్పుడూ ఇన్ని కామెంట్స్ చూడలేదు.కొంతమంది అయితే మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు.

నన్ను టాప్ లో పెట్టి గెలిపించారు కాబట్టి.నేను మీరు చేసిన కామెంట్లు యాక్సెప్ట్ చేయాలి అందుకే ఆ కామెంట్స్ తీసుకుంటున్న అని సమాధానమిచ్చింది సిరి.

నాపై ఎవరైతే నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారో వాళ్లందరికీ నేను ఒకటే చెబుతున్నాను.మా ఇద్దరిలో చెడు ఉద్దేశమే ఉంటే కెమెరాల ముందు ఎందుకు చేస్తాం.

ఇంకా ఏదైనా ప్లేసులో చేసే వాళ్ళం మాకు నిజంగానే అలాంటి ఉద్దేశం లేదు.మేము లోపల ఎంత జెన్యూన్ గా ఉన్నామో బయట కూడా అలాగే ఉంటాం.

మా ఫ్రెండ్ షిప్ అలాగే కొనసాగుతుంది.దయచేసి ఈ విషయాన్ని మీరు నెగిటివ్ గా తీసుకోకండి.

అంటూ ఎమోషనల్ అయ్యింది సిరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube