ప్రముఖ టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి( Singer Sravana Bhargavi ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.శ్రావణ భార్గవి పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సింగర్ గా ఇప్పటికీ మంచి ఆఫర్లతో శ్రావణ భార్గవి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా శ్రావణ భార్గవి పాపులారిటీని మరింత పెంచుకున్నారు.
వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే శ్రావణ భార్గవి హేమచంద్రను పెళ్లి చేసుకున్నారు.
2013 సంవత్సరంలో హేమచంద్ర( Singer Hema Chandra ) శ్రావణ భార్గవి వివాహం గ్రాండ్ గా జరిగింది.ఈ జంటకు ఒక పాప కూడా ఉంది.అయితే హేమచంద్ర శ్రావణ భార్గవి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ప్రచారం జరిగింది.
అయితే ఈ వార్తలను హేమచంద్ర శ్రావణ భార్గవి ఖండించడం జరిగింది.అయితే తాజాగా హల్దీ ఫోటోలు( Haldi ) వైరల్ కాగా శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోనున్నరని కొంతమంది జోరుగా ప్రచారం చేయడం జరిగింది.
అయితే వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయగా వైరల్ అయిన ఫోటోలు శ్రావణ భార్గవి సోదరుడి హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు అనే క్లారిటీ వచ్చింది.ఇంత నీచంగా ఎలా ప్రచారం చేస్తారంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
ఆ ఫోటోలు కూడా ఏడాది క్రితం ఫోటోలు కావడం గమనార్హం.
సెలబ్రిటీల గురించి వార్తలు ప్రచురించే ముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారణ చేసుకుంటే మంచిది.శ్రావణ భార్గవి మాత్రం మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.హేమచంద్ర, శ్రావణ భార్గవి కలకాలం సంతోషంగా, అన్యోన్యంగా జీవనం సాగించాలని నెటిజన్లు( Netizens ) ఆకాంక్షిస్తున్నారు.
శ్రావణ భార్గవి, హేమచంద్ర పారితోషికాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి.వీళ్లిద్దరూ కలిసి మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.