వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బాలీవుడ్ బ్యూటీ శ్వేతా తివారి తాజాగా మరొక వివాదంలో ఇరుక్కుంది.ఎన్నో బాలీవుడ్ సినిమాలలోను వెబ్ సిరీస్ లలో, టీవీ సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్వేతా తివారి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని దేవుడి గురించి అసభ్యకర పదజాలం ఉపయోగించింది.
దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏకంగా మధ్యప్రదేశ్ హోంమినిస్టర్ స్పందిస్తూ తన పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
శ్వేతా తివారీ తన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘షో స్టాపర్’ ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ నా లోదుస్తుల కొలతలను దేవుడు తీసుకున్నాడని దేవుడు గురించి అసభ్యంగా మాట్లాడటంతో ఇది కాస్తా వివాదంగా మారింది.
ఈ వీడియోని చూసిన మధ్యప్రదేశ్ హోంమినిస్టర్ భోపాల్ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ 24 గంటల్లో నివేదిక సమర్పించాలని తెలిపారు.అయితే సదరు నటి అలా ఎందుకు మాట్లాడింది అనే విషయానికి వస్తే…
ఈమె నటించిన ఈ వెబ్ సిరీస్ లో ఈమె మోడల్ గా సందడి చేయనున్నారు.
ఇదే వెబ్ సిరీస్ లో సౌరబ్ జైన్ అనే నటుడు ‘బ్రా’ ఫిట్టర్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలోనే ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.అయితే సౌరభ్ జైన్ ఇదివరకే మహాభారతం టీవీ సీరియల్ లో కృష్ణుడు పాత్ర పోషించడం వల్ల అతనిని దేవుడిగా భావించి శ్వేతా తివారి ఈ వెబ్ సిరీస్ లో తన బ్రా సైజులు తీసుకున్నారనీ తెలుపుతూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.ఇలా సరదాగా మాట్లాడిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసాయి.మరి ఈ విషయంపై నటి శ్వేతా తివారి ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.