విడాకుల గురించి ఘాటుగా స్పందించిన హిమజ.. తప్పకుండా పిలవండి అంటూ?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులు సినిమాలకంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు.అలాంటి వారిలో హిమజా కూడా ఒకరు.

 Himaja Gives Clarity About Rumors, Himaja, Tollywood, Divorce, Social Media-TeluguStop.com

హిమజ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.హిమజ యూట్యూబ్ ఛానల్ ద్వారా తరచూ వీడియోలు చేస్తూ ఎంతో ఫేమస్ అయింది.

సినిమాలు టీవీ షోస్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ తో హిమజా ఎప్పుడు బిజీగా ఉంటుంది.అయితే తాజాగా హిమజ విడాకుల విషయం గురించి వచ్చిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

హిమజ ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.తన సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఇటీవల హిమజ కొత్త ఇంటిని నిర్మించనుంది.ఇంటి పనులు ఇప్పటికే మొదలయ్యాయి.తాజాగా కన్స్ట్రక్షన్ లో ఉన్న తన ఇంటి గురించి హిమజ వీడియో చేసినప్పుడు తన తల్లిదండ్రుల కోసం కట్టిస్తున్న స్పెషల్ రూమ్స్ గురించి మాట్లాడింది.

అంతేకానీ ఎప్పుడు తన భర్త గురించి ప్రస్తావన తీసుకు రాలేదు.హిమజకి పెళ్లి అయిందా, లేదా అనే సందేహం చాలామందిలో ఉంది.

కానీ గూగుల్ లో మాత్రం హిమజకు పెళ్లి అయినట్టు సమాచారం ఉంది.

ఇటీవల హిమజ విడాకుల గురించిన వార్త బాగా వైరల్ అయింది.ఈ విషయం గురించి హిమజ స్పందిస్తూ నా పని నేను చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉన్నాను.నాలుగేళ్ల తర్వాత మంచి పూల డెకరేషన్ మధ్యలో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటాను.

కానీ ఒకరిని కామెంట్ చేసేటప్పుడు అది ఎంతవరకు నిజం, ఆ కామెంట్ల వల్ల వారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో అన్న విషయం కాస్త గుర్తించండి అంటూ కామెంట్ చేసింది.ఈ మధ్యకాలంలో మనుషులతో ప్రమేయం లేకుండా యూట్యూబ్ లోనే పెళ్లిళ్లు చేసి విడాకులు ఇచ్చేస్తున్నారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాలు వల్ల మనసుకు ఎంతో బాధ కలుగుతుంది.నా పెళ్లి చేసినా, నాకు విడాకులు ఇప్పించినా తప్పకుండా నన్ను పిలవండి అంటూ ఘాటుగా స్పందించింది.

Himaja Gives Clarity About Rumors, Himaja, Tollywood, Divorce, Social Media - Telugu Divorce, Himaja, Tollywood

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube