కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు కమల్ హాసన్( Kamal Hassan ) ఒకరు.నటుడిగా ఇండస్ట్రీలో దశాబ్దాల నుంచి కొనసాగుతూ ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని అందిస్తున్నారు.
బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి కమల్ హాసన్ అనంతరం హీరోగా ఎన్నో విభిన్నమైన చిత్రాలలో విభిన్నమైనటువంటి పాత్రలలో నటిస్తూ ఇప్పటికి స్టార్ స్టేటస్ అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు.ఇక ఈయన చివరిగా విక్రమ్( Vikram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అందుకున్నారు.
ఇక ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
ఈ విధంగా కమల్ హాసన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 65 సంవత్సరాలు పూర్తి కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.కమల్ హాసన్ కి సంబంధించిన రేర్ ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ విధంగా కమల్ హాసన్ 65 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకోవడంతో ఆయన కుమార్తె శృతిహాసన్ ( Shruthi Hassan ) సోషల్ మీడియా వేదికగా తన తండ్రి సినీ కెరియర్ గురించి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా శృతిహాసన్ సోషల్ మీడియా( Social media ) వేదికగా స్పందిస్తూ…తన తండ్రి సినీ ప్రయాణం అంతా సజావుగా, సులభంగా ఏమి సాగలేదని తెలిపారు.ఈ సినీ ప్రపంచంలో నాన్న అలుపెరుగని పోరాటం చేశారు.ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని, ఇక ఆయన చాలెంజింగ్ చేసే పాత్రలలో నటించే సమయంలో ఎన్నో ప్రమాదాలకు కూడా గురయ్యారని తెలిపారు.ఇండస్ట్రీ ఎదుగుదల కోసం తన తండ్రి తన వంతు కృషి చేశారు.
గత ఆరు సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీకి సేవలు చేస్తూనే ఉన్నారని అయితే ఆయన నటించినటువంటి పాత్రలలో మరెవరు కూడా నటించలేరు అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ తన తండ్రి సినీ ప్రస్థానం గురించి స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.