లెజెండరీ నటుడు కమల్ హాసన్( Kamal Haasan ) కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి శృతిహాసన్.అనగనగా ఒకదీరుడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి శృతిహాసన్ ( Shruti Haasan ) మొదటి సినిమాతోనే డిజాస్టర్ ఎదుర్కొన్నారు.
ఇలా ఈమె కెరియర్ మొదట్లో నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్ అంటూ ఈమెపై భారీగా ట్రోల్స్ చేశారు.ఇలా వరుస డిజాస్టర్ లను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.ఈమె తరచు తన ప్రియుడితో( Shruti Haasan boyfriend Santanu Hazarika ) కలిసి రెస్టారెంట్ లకు వెళ్లడం షాపింగ్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.అలాగే సోషల్ మీడియాలో కూడా తన ప్రియుడికి సంబంధించిన విషయాలను చెబుతూ ఉంటారు.ఇక తనకు ఏమాత్రం విరామ సమయం దొరికిన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.
అభిమానులు అడిగే ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెబుతూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో ముచ్చటించిన శృతిహాసన్ కు ఒక నెటిజన్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.శృతిహాసన్ పుట్టి పెరిగిన కల్చర్ ఆధారంగా నేటిజెన్ ఈమెను ప్రశ్నిస్తూ మీకు మందు (Alcohol)తాగే అలవాటు ఉందా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తనకు మందు తాగే అలవాటు లేదని అలాగే డ్రగ్స్ (Drugs) తీసుకునే అలవాటు కూడా లేదని తెలియజేశారు.
అలాగే తాను తన జీవితాన్ని ఎంతో హుందాగా గడిపే నటిని అంటూ ఈమె సమాధానం చెప్పడంతో పలువురు ఈమెకు ఉన్న మంచి అలవాట్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.