కమల్ హాసన్( Kamal Hassan ) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి శృతిహాసన్(Shruthi Hassan) వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటనపరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ త్వరలోనే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా( Salar Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.త్వరలోనే సలార్ సినిమా ద్వారా శృతిహాసన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈమె కెరియర్ విషయాన్ని పక్కన పెట్టే వ్యక్తిగత విషయానికి వస్తే శృతిహాసన్ శంతను హజారిక ( Shanthanu Hajarika ) అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఇలా తరచూ తన ప్రియుడితో కలిసి ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు క్షణాలలో వైరల్ అవుతుంటాయి.ఇలా గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు.కానీ పెళ్లి గురించి మాత్రం అసలు ఆలోచించడం లేదని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేటటువంటి శృతిహాసన్ వీరు కు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అయితే మొదటిసారి తన ప్రియుడుతో ఏర్పడినటువంటి పరిచయం గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా నేటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ శంతనుతో తనకు పరిచయం ఎలా ఏర్పడిందనీ అడిగారు.ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ తాను నాకు మొదటిసారి ఇంస్టాగ్రామ్( Instagram ) ద్వారా పరిచయం ఏర్పడ్డారని ఈమె తెలియజేశారు.తాను వేసే ఆర్ట్ నాకు ఎంతగానో నచ్చాయి.దీంతో తనని నేనే ముందుగా ఫాలో అయ్యాను అలాగే తన పోస్టులకు లైక్ చేసే దానిని తను కూడా నేను చేసే పోస్టులకు లైక్ కొట్టేవారు ఇలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో ఒకరికొకరం మెసేజ్ చేసుకునే వారిమని అలా మా ఇద్దరి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ తన ప్రేమ గురించి అలాగే తన ప్రియుడి పరిచయం గురించి తెలియజేశారు.