టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు.శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
క్లాస్ సినిమాల ద్వారా శేఖర్ కమ్ముల పాపులారిటీని ఊహించని రేంజ్ లో పెంచుకున్న సంగతి తెలిసిందే.ఆనంద్ సినిమాతో శేఖర్ కమ్ములకు మంచి పేరు వచ్చింది.
రాజా, కమిలినీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.
ఒక ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఆనంద్ సినిమాను పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నానని తెలిపారు.
ప్రేక్షకులు సినిమా నచ్చితేనే వెళతారని ఆయన కామెంట్లు చేశారు.విన్నింగ్ ఫార్ములాను ఎవరూ చెప్పలేమని శేఖర్ కమ్ముల అన్నారు.
నేను కొన్ని సినిమాల రేంజ్ గెస్ చేశానని ఆయన తెలిపారు.సినిమాల అసలు లెక్కలు వేరే విధంగా ఉంటాయని శేఖర్ కమ్ముల అన్నారు.

సినిమా బడ్జెట్ కు అనుగుణంగా తాను డబ్బు తీసుకుంటానని ఆయన తెలిపారు.హ్యాపీడేస్ మూవీని చాలా తక్కువ లాభానికి దిల్ రాజుకు ఇచ్చానని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఆస్తులు అమ్ముకుని సినిమాల హక్కులు కొంటారని ఆయన తెలిపారు.కొంతమంది కష్టాలను చెప్పుకుంటారని శేఖర్ కమ్ముల అన్నారు.డిస్ట్రిబ్యూటర్లకు నిజంగా నష్టాలు వస్తే డబ్బులు ఇవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు.

పవన్ నాకు ఇష్టమైన హీరో అని ఆయనను దృష్టిలో ఉంచుకుని కథ రాశానని శేఖర్ కమ్ముల తెలిపారు.నాకు ఛాయిస్ లేకపోవడంతో శంకర్ దాదా రిలీజ్ టైమ్ లో ఆనంద్ సినిమాను విడుదల చేశానని ఆయన అన్నారు.ఆస్తులు అమ్మి ఆనంద్ సినిమా తీశానని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.
ఆనంద్ మూవీ మ్యాజిక్ అని ఆయన తెలిపారు.శేఖర్ కమ్ముల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.