చనిపోయిన తర్వాత సిల్క్ స్మిత శవానికి అలాంటి పరిస్థితా.. ఏం జరిగిందంటే?

దక్షిణాది భాషలతో పాటు హిందీ సినిమాలలో కూడా నటించి సిల్క్ స్మిత ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.గ్లామర్ రోల్స్ లో, స్పెషల్ సాంగ్స్ లో నటించడం ద్వారా సిల్క్ స్మిత పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరిగింది.

 Shocking Facts About Actress Silk Smitha Death Details Here Silk Smitha , Death-TeluguStop.com

ఏలూరులోని నిరుపేద కుటుంబంలో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి.వండి చక్రం అనే సినిమాలో సిల్క్ పాత్రతో ఆమె కెరీర్ మొదలైంది.

ఆ సినిమా సక్సెస్ సాధించడంతో ఆమె తన పేరును సిల్క్ స్మితగా మార్చుకున్నారు.కొన్ని సినిమాలలో సిల్క్ స్మిత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించి మెప్పించడం గమనార్హం.

సిల్క్ స్మిత చనిపోయే వరకు పెళ్లికి దూరంగానే ఉన్నారు.ఆత్మహత్య చేసుకుని సిల్క్ స్మిత మృతి చెందగా ఆమె మృతికి సంబంధించి వేర్వేరు కారణాలు ప్రచారంలో రావడం గమనార్హం.

సినిమాల నిర్మాణంలో నష్టాలు రావడంతో పాటు ప్రేమ వ్యవహారాలు ఆమె మృతికి కారణమని చాలామంది భావిస్తారు.

Telugu Anu Radha, Silk Smitha, Sri Vidya, Tollywood, Vandi Chakram-Movie

మద్యపానానికి బానిస కావడం కూడా ఆమె మృతికి కారణమని మరి కొందరు అనుకుంటారు.ఈ కారణాల వల్ల నిస్పృహలోకి వెళ్లిన సిల్క్ స్మిత చనిపోయారని చాలామంది భావిస్తారు.నటి, సిల్క్ స్మిత స్నేహితురాలు అయిన అనురాధ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

సిల్క్ స్మిత తన క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ కొన్ని విషయాలను ఆమె వెల్లడించేది కాదని అనురాధ అన్నారు.సిల్క్ స్మిత చనిపోవడానికి ముందురోజు తనకు కాల్ చేసిందని తనను ఇంటికి రమ్మని అడిగిందని కానీ ఉదయానికి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.

సిల్క్ స్మిత చనిపోయిన తర్వాత పోస్టుమార్టం పూర్తి చేశాక ఆమె శరీరంపై ఈగలు వాలుతుంటే ఆమె పరిస్థితి ఇలా అయిందని తనకు బాధ వేసిందని ఆమె చెప్పుకొచ్చారు.నటి శ్రీవిద్య కూడా సిల్క్ స్మిత శవాన్ని చూసి ఏడ్చేశారని అమె కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube