కొంతమంది కోట్ల రూపాయల డబ్బు ఉన్నా రూపాయి కూడా దానం చేయడానికి ఇష్టపడరు.అయితే ఒక వ్యక్తి మాత్రం రోజుకు 3 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి ఏకంగా 1161 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం గమనార్హం.
ప్రముఖ పారిశ్రామికవేత్త, హెచ్.సీ.ఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్( Shiv Nadar ) సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.తమిళనాడు ( Tamil Nadu )రాష్ట్రంలోని మూలైపోజి అనే పల్లెటూరిలో శివ నాడార్ జన్మించారు.
1975 సంవత్సరంలో స్నేహితులు, సహోద్యోగులతో కలిసి శివ నాడార్ మైక్రో కాంప్ లిమిటెడ్ ను మొదలుపెట్టారు.మొదట ఈ సంస్థ టెలీ డిజిటల్ క్యాలిక్యులేటర్లను సృష్టించడంపై దృష్టి పెట్టి సక్సెస్ అయింది.18,700 రూపాయల పెట్టుబడితో హెచ్.సీ.ఎల్ కంపెనీ ( HCL Company )ప్రస్థానం మొదలు కాగా 1999 సంవత్సరంలో బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ లో ఈ సినిమా లిస్ట్ కావడం గమనార్హం.ఐబీఎం, యాపిల్ కంటే ముందుగా 1978 సంవత్సరంలో ఈ సంస్థ హెచ్.
సీ.ఎల్.8సీ అనే తొలి పీసీని అందించారు.తొలి ఏడాదిలోనే 10 లక్షల అమ్మకాలతో ఈ సంస్థ చరిత్ర సృష్టించింది.ఆ తర్వాత సింగపూర్ కేంద్రంగా ఈ సంస్థ వ్యాపారాన్ని విస్తరించింది.2022 సంవత్సరంలో ఈ సంస్థ ఆదాయం ఏకంగా 11.5 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం.
డెల్ గివ్ హురూన్ ఇండియా ఫిలాంత్రపీ జాబితాలో శివ్ నాడార్ టాప్ లో నిలిచారు.ఏకంగా 1161 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించి ఆయన మంచి మనస్సును చాటుకున్నారు.శివ్ నాడార్ మంచి మనస్సు గురించి ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పవచ్చు.
శివ నాడార్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.శివ నాడార్ రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి సహాయం చేసి మంచి మనస్సును చాటుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
తన సక్సెస్ స్టోరీతో హెచ్.సీ.ఎల్( HCL ) వ్యవస్థాపకుడు శివ నాడార్ ప్రశంసలను అందుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.