భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు కొదువ లేదు.ఆచారాలకు కట్టుబాట్లకు భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.
అలాంటి సాంప్రదాయంలో ఒకటైన కార్యక్రమం కర్వా చౌత్.ఈ కార్యక్రమంలో భాగంగా భర్త కోసం భార్య చేసే ఉపవాస దీక్షను ఎక్కువగా ఉత్తర భారతదేశంలో జరుపుకుంటూ ఉంటారు.
ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలో కాస్త తక్కువే అని చెప్పవచ్చు.భార్య తమతో పాటు ఏడడుగులు నడిచిన వ్యక్తి సుఖ సంతోషాలతో, అష్టఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ భార్యలు ఉపవాస దీక్ష చేపట్టి పూజలు చేస్తారు.
అలా ఆ రోజు రాత్రి చంద్రుడికి పూజలు చేసిన తర్వాత ఓ జల్లెడను తెరగా చేసుకొని భర్తను చూస్తారు.అలా కర్వా చౌత్ కార్యక్రమాన్ని మహిళలు ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసుకుంటారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు వారి చేతికి గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయం.తమ జీవితం కూడా భర్తతో సంతోషంగా రంగులమయం కావాలని వారు ఆకాంక్షింస్తారు.
నేడు ఈ కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా జరుపుకోనున్నారు.ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వేడుకగా జరుపుకుంటారు.
ఇందులో భాగంగానే నటి శిల్పాశెట్టి తన భర్త కోసం ప్రతి ఏడాది ఉపవాసం ఉంటూ పూజలు చేస్తూ ఉంటుంది.అయితే శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నవ్వు తెప్పించేలా ఓ మీమ్ తయారు చేసి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.
ఇక ఈ ఫోటోలో తన కోసం తన భార్య ఉపవాసం చేస్తున్న భార్య నటి శిల్పాశెట్టి ఫోటోలు షేర్ చేస్తూ ఈ రోజు తన భార్య ఓ జల్లడ సహాయంతో తన ముఖాన్ని చూస్తుందని తెలిపాడు.కాకపోతే వాస్తవానికి ఆమె అద్దంలో ఆ తర్వాత ఏం తినాలో అవి కనిపిస్తాయి అంటూ ఒక మీమ్ ను తయారు చేసి దానిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
అదేవిధంగా నటి కియారా అద్వానీ కూడా ఈ రోజు పండుగను పురస్కరించుకొని మెహంది ఆర్టిస్ట్ గా మారిపోయి మెహందీ పెట్టుకుని కర్వా చౌత్ ఉత్సవాలలో పాల్గొన్నారు.అందుకు సంబంధించిన ఫోటోలను ఆవిడ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.