మరొక సినిమాకు శ్రీకారం చుట్టిన శర్వా

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన దూకుడును ప్రదర్శిస్తు్న్నాడు.ఇప్పటికే స్టార్ బ్యూటీ సమంతతో కలిసి జాను అనే సినిమాను రెడీ చేసిన శర్వా, తన నెక్ట్స్ మూవీ ‘శ్రీకారం’ను తాజాగా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

 Sharwanand Lines Up Another Project This Year-TeluguStop.com

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను లైన్‌లో పెట్టాడు ఈ హీరో.

చిత్రలహరి సినిమాతో సాయి ధరమ్ తేజ్‌కు ఎంతో అవసరమైన సక్సెస్‌ను అందించిన దర్శకుడు కిషోర్ తిరుమలతో శర్వానంద్ తన నెక్ట్స్ మూవీని చేయనున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు ఫిలింనగర్ వర్గాల టాక్.శ్రీకారం సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి కిషోర్ తిరుమలతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నాడట శర్వా.

కాగా కిషోర్ తిరుమల కూడా ప్రస్తుతం రామ్ పోతినేనితో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమా పూర్తవ్వగానే శర్వాతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఏదేమైనా వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న శర్వా, వాటిని హిట్‌లుగా మార్చుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు.గతేడాదిలో రణరంగం సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ సంగతి తెలిసిందే.

మరి శర్వాకు ఈ ఏడాదిలో ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube