ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన శరత్ బాబు( Sarath Babu ) మరణం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది.71 సంవత్సరాల వయస్సులో శరత్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే.శరత్ బాబు మరణం తర్వాత ఆయన ఆస్తులకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శరత్ బాబు చనిపోయారు.చాలా సంవత్సరాల క్రితం శరత్ బాబు, రమా ప్రభ పెళ్లి చేసుకున్నారు.
అయితే పెళ్లి తర్వాత రమాప్రభ ( Rama Prabha ) శరత్ బాబు మధ్య మనస్పర్ధలు రావడంతో వాళ్లిద్దరూ విడిపోయారని సమాచారం.
రమా ప్రభకు కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చినట్టు శరత్ బాబు వెల్లడించినా రమా ప్రభ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పూరీ జగన్నాథ్ ప్రతి నెలా కొంత మొత్తం సహాయం చేస్తున్నారని సమాచారం అందుతోంది.అయితే శరత్ బాబు ఆస్తుల గురించి ఆయన సోదరి సరిత( Saritha ) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు తల్లైనా తండ్రైనా అన్నైనా శరత్ బాబు అని ఆమె తెలిపారు.తన కూతురు సోనియాను దత్తత తీసుకుంటానని అన్నయ్య నాతో చాలా సందర్భాల్లో చెప్పారని అయితే నేను పెద్దగా పట్టించుకోలేదని ఆమె తెలిపారు.ఒకవేళ సోనియాను శరత్ బాబు దత్తత తీసుకుని ఉంటే మాత్రం ఆమే ఆస్తికి వారసురాలు అయ్యేది.అన్నయ్య మిగతా ఆస్తి ఎవరికి చెందుతుందనే ప్రశ్నకు తన దగ్గర జవాబు లేదని సరిత అన్నారు.
సరిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శరత్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శరత్ బాబు తెలుగులో నటించిన చివరి సినిమా మళ్లీ పెళ్లి రేపు థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం.ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాల్సి ఉంది.