బుల్లితెర నటి ఆషికా పదుకొనే అంటే మనలో చాలా మందికి తెలియదు.కాని కథలో రాజకుమారి సీరియల్ ఫేమ్ ఆషిక అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు.
ఈ సీరియల్ ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.స్టార్ మాలో ప్రసారం అయిన కథలో రాజకుమారి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సీరియల్ ద్వారా ఇక్కడ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈమె జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని అనే సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటిస్తోంది.
ఈ సీరియల్‌కి మంచి రేటింగ్ రావడంతో పాటుగా జీ తెలుగు సీరియల్స్ లో టాప్ సీరియల్‌గా దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆషికా వివాహం జరిగింది.
తన ప్రియుడు, బిజినెస్ మ్యాన్ చేతన్ శెట్టితో బుల్లితెర నటి ఆషికా పదుకొణె వివాహం జరిగింది.కుటుంబసభ్యులు, ఇండస్ర్టీకి చెందిన అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో సోమవారం(అక్టోబర్ 18)న వీరి వివాహం జరిగింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గతే ఏడాది బెంగళూరులోని ఓ హోటల్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.చేతన్ తనకు బాగా తెలుసని, లాక్‌డౌన్‌లో తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆషికా ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.పెళ్లి తర్వాత కూడా తాను సీరియల్స్‌లో నటిస్తానని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలోనూ ఈమెకు మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం ఆషికా త్రినయని అనే సీరియల్‌లో నటిస్తుంది.