సముద్రం, లేదంటే చెరువుల దగ్గర మనకు తాబేళ్లు చాలా కనిపిస్తూ ఉంటాయి.అయితే ఇవి కేవలం నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న తీరాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.
కాగా ఇప్పుడు ఓ భారీ తాబేలు గురించి చెప్పుకోబుతున్నాం.దీన్ని చూస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు.
దీని బరువు ఏకంగా 272 కిలోలు.అయితే ఈ భారీ తాబేలు బురదలో చిక్కుకుంది.
సముంద్ర తీరం నుంచి దూరంగా వచ్చి బురదలో ఎటూ కదల్లేని పరిస్తితిలో చిక్కుకుంటే దాన్ని సురక్షితంగా కాపాడేందుకు అక్కడున్న స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది.
దాన్ని మళ్లీ సముద్రంలోకి పంపించేందుకు ఏకంగా ఏజెన్సీల సిబ్బంది పనిచేశారు.
స్థానిక ప్రజలతో పాటు ఆ ఏజెన్సీల సిబ్బంది కలిసి ప్రత్యేకంగా క్రియేట్ చేసిన రవాణా బండితో పాటు ఓ స్ట్రెచర్, చాపలను కూడా దీనికోసం వాడేశారు.ఈ ఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది.
అయితే ఇక్కడ ఉండే ఓ మసాచుసెట్స్ ప్రాంతంలోకి అనుకోకుండా వచ్చి బురదలో ఇరుక్కున్నమముత్ లెదర్‌బ్యాక్ తాబేలుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.ఎందుకంటే ఒక్క తాబేలును సముద్రంలోకి పంపించేందుకు వారు అంతలా కృషి చేశారు.
హెర్రింగ్నదికి చెందినటువంటి బురదలో ఇరుక్కుపోయిన ఈ తాబేలును అంతర్జాతీయ జంతు సంరక్షణ అధికారులు దాన్ని రక్షించి పశువైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు.వారు ఆ తాబేలుని మొత్తం టెస్టులు చేసిన తర్వాత పూర్తి ఆరోగ్యంతో ఉందా లేదా అనే దానిపై క్లియరెన్సు తీసుకుని ఆ తర్వాత దాన్ని తిరిగి సముద్రంలోకి విడిచి పెట్టారు.ఇలా దాన్ని సముద్రంలోకి తరలించేందుకు ఏకంగా మూడు ఏజెన్సీల సిబ్బంది పనిచేశారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైలర్ అవుతోంది.మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఓ లుక్కేసి చూసేయండి.