మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో సూపర్ స్టార్ మహేష్ సినిమాపై కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.అసలైతే గీతా ఆర్ట్స్ లో మహేష్ మూవీ ఎప్పుడో చేయాల్సింది కాని కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ఇక లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ లో మహేష్ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు.సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో మహేష్ హీరోగా అల్లు అరవింద్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందని టాక్.
ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత త్రివిక్రం తో సినిమా ఫిక్స్ అయినట్టు తెలిసిందే.అయితే త్రివిక్రం సినిమాతో పాటుగా అనీల్ రావిపుడి సినిమా కూడా పార్లర్ గా నడిపిస్తాడని తెలుస్తుంది.అనీల్ రావిపుడితో మహేష్ ఆల్రెడీ సరిలేరు నీకెవ్వరు సినిమా చేశాడు.
మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతుంది.సరిలేరు సినిమా షూటింగ్ టైం లోనే అనీల్ రావిపుడి మహేష్ కు ఓ కథ వినిపించాడట.
ఆ కథతోనే ఇప్పుడు ఈ సినిమా వస్తుందని చెప్పుకుంటున్నారు.