హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో మృతిచెందిన ఇంటర్ విద్యార్థి సాత్విక్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.కళాశాలల వేధింపులు తాళలేకనే సాత్విక్ చనిపోయాడని పోలీసులు తెలిపారు.
క్లాసులో అందరి ముందూ సాత్విక్ ను బూతులు తిట్టడంతో తీవ్ర మనస్తాపం చెందాడని పోలీసులు వెల్లడించారు.తోటి విద్యార్థుల ముందు పదేపదే కొట్టడం వల్ల కుంగిపోయాడన్నారు.
ఆచార్యతో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచుగా సాత్విక్ ను తిట్టారని చెప్పారు.వాళ్లంతా తిట్టడంతోనే సాత్విక్ మానసికంగా కుంగిపోయాడని తెలిపారు.
చనిపోయే రోజు పేరెంట్స్ వచ్చి వెళ్లిన తర్వాత సాత్విక్ ను చితకబాదారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.తననే కాకుండా ఇంట్లో వాళ్లని కూడా తిడుతూ ఆచార్య, కృష్ణారెడ్డి మాట్లాడారని రిపోర్టులో స్పష్టం చేశారు.