ఒకప్పుడు అందరూ కలిసి సినిమాలు చూసేవాళ్ళు.కానీ ఇప్పుడు ఒంటరిగా చూస్తున్నారు.
ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అందరి దగ్గరికి వస్తున్నాయి.పెద్ద స్క్రీన్ పై సినిమా చూడడం కంటే చిన్న స్క్రీన్ పై చూడడానికి అలవాటు పడుతున్నారు జనాలు.
ఈమధ్య చిన్న స్క్రీన్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ బాగా ముందున్న సంగతి తెలిసిందే.ఇక ఇందులో ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ప్లాట్ ఫామ్ గురించి సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మండిపడుతున్నారు.
తెలుగు సినీ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు.
ఎన్నో సినిమాలలో విలన్, సహాయ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇదిలా ఉంటే ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా కొన్ని విషయాలు పంచుకున్నాడు.
ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు సగానికి సగం ఆడకుండా పోవడానికి కారణం ఓటీటీ అని నేరుగా చెప్పేసాడు.జనం చేతిలోకి సినిమా వచ్చేస్తుంటే థియేటర్ కి ఎవడు వెళ్తాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదివరకు కాలక్షేపం కోసం థియేటర్ కి వెళ్లే పరిస్థితి ఉండేది కానీ ప్రస్తుతం అలాంటివి ఏమీ లేవని ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పోయిందని అన్నారు.ఇక రాను రాను థియేటర్ లే కల్యాణమండపాలు గా చేసుకోవాల్సి వస్తుందన్నాడు.

ఇక తనకు లక్ష రూపాయలు ఇవ్వడానికి దాదాపు 26 ఏళ్లు పట్టిందని తెలిపాడు.కానీ ఇప్పుడు రోజుకి లక్ష.గంటల లెక్కల లక్షలు తీసుకుంటున్నారని కొన్ని విషయాలు బయట పెట్టాడు.ఇక తాను ఎప్పుడు అంతా ఇంత కావాలని డిమాండ్ చేయలేదట.అది తన వీక్నెస్ అనుకోవచ్చని.బతకనేర్చలేనితనం అని అనండి అంటున్నారు.
ఇక నిర్మాతలు మాత్రం తనకు ఇంత ఇస్తామని అంటే.తాను కూడా అంతే తీసుకునేవాడట.
ఎవరైనా తెలిసిన, సన్నిహితంగా ఉన్న నిర్మాతలతో మాత్రం కొంచెం ఎక్కువ ఇవ్వండని అడిగేవారట.అంతే కానీ తాను ఎప్పుడు గట్టిగా డిమాండ్ చేయలేదట.
పైగా ఒక్కడితో నైనా కోట డబ్బుల కోసం ఇబ్బంది పెట్టాడు ఏమో అని అనిపించండి చాలు అంటూ.కానీ ఎప్పుడు కూడా అలాంటిది జరగలేదని.
అందుకే తాను ఇక్కడ ఉండిపోయాను అంటూ తెలిపాడు.