ఏపీ ఎన్నికలకు( AP Elections ) పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeswari ) అన్నారు.ఏపీలో బీజేపీ పుంజుకుంటుందని భావిస్తున్నామని తెలిపారు.
పొత్తులను కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో( BJP Janasena Alliance ) ఉందన్న ఆమె పద్ధతి ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.కేంద్రం సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు.రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ, వైసీపీకి నిబద్ధత లేదని తెలిపారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని విమర్శించారు.