2019 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్, పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై పోటి చేసి ఓడిపోయిన సతీష్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో సైలెంట్ గా ఉంటున్నాడు.దీనికి కారణం కూడా లేకపోలేదు సతీష్ రెడ్డి మౌనం వెనుక కారణం ఆయన వైసిపి పార్టీ లో చేరబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి వార్తలే గతంలో కూడా చాలానే వచ్చాయి.ఇప్పుడు వస్తున్న వార్తలు తెలుగుదేశం పార్టీ కి చేదు వార్తే అన్ని చెప్పాలి.
ఇన్ని రోజులు పులివెందులలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడింది మాత్రం సతీష్ రెడ్డినే చెప్పాలి అక్కడ మంచి పేరు ఉన్నది.అసలు పులివెందులలో రాజశేకర్ రెడ్డి ఫ్యామిలీ కి వ్యతిరేకంగా పోటి చెయ్యడానికి బయపడే తరుణంలో సతీష్ రెడ్డి వాళ్ళకు ధీటుగా పోతిచేస్తూ వస్తున్నాడు.
గతంలో దివంగత నేత రాజశేకర్ రెడ్డి పైన అయన మరణం తరువాత వైయస్ జగన్ పైన పోటి చేసిన ఏకైక వ్యక్తి సతీష్ రెడ్డి.జగన్ పార్టీ స్థాపించి అధికారంలోకి వచిన్నప్పటినుండి, సతీష్ రెడ్డి సైలెంట్ గా ఉంటున్నాడు.
తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో యమా ఆక్టివ్ గా ఉండే సతీష్ రెడ్డి ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు.పులివెందులలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను, పెంచడంలోనూ ఎంతో కృషి చేశాడు.
ఎలక్షన్స్ సమయంలో పోలింగ్ బుత్ లల్లో ఏజెంట్స్ ని నిలబెట్టడమే కష్టం అయ్యే పరిస్థితుల్లో ప్రజల్లో తిరుగుతూ తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచాడు.ఇటివల చంద్రబాబు కడప పర్యటనలో మాత్రమే హాజరయ్యారు.
ఆ తరువాత పార్టీ నియోజకవర్గ సమావేశంలోను ఇతర కార్యక్రమాల్లోనూ ఎక్కడ కనిపించడం లేదు.దీంతో సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పి వైసిపి పార్టీ లోకి వెల్కమ్ చెప్పబోతున్నారు అనే వార్తలు వస్తుండటంతో, పార్టీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.
పులివెందులల్లో టిడిపి తరుపున ఉన్న ఒకే ఒక్క బలమైన నాయకుడు చేజారుతుండటంతో ఇప్పుడు అక్కడ అసలు పార్టీ మనుగడకే ప్రమాదం వచ్చేటట్లు ఉన్నది.