జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నేడు తెలంగాణ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో పోటీకి సంసిద్ధం కావాలని నాయకులకు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో పోటీ చేసే నియోజకవర్గాలను వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని నాయకులకు సూచించడం జరిగింది.తెలంగాణ జనసేన( Telangana Janasena ) సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు శ్రీరామ్ తాలూరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధా రామ్ రాజలింగం పాల్గొనడం జరిగింది.
మరికొద్ది నెలలలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో ఈసారి జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీ కూడా పోటీ చేయబోతున్నట్లు పవన్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే ఏపిలో నాలుగో విడత వారాహి విజయయాత్ర( Varahi Vijaya Yatra ) అక్టోబర్ మొదటి తారీకు నుండి స్టార్ట్ చేయబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటన చేయడం జరిగింది.కృష్ణాజిల్లాలో యాత్ర ప్రారంభం కానుందని తెలపడం జరిగింది.
అక్టోబర్ మొదటి తారీకు అవనిగడ్డలో పార్టీ నాయకులతో సమావేశం అనంతరం.బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే మూడు విడతల వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా నిర్వహించారు.నాలుగో విడత విజయ యాత్రకు సమన్వయకర్తల నియామకానికి పవన్ కళ్యాణ్ ఆమోదం కూడా తెలపడం జరిగింది.
ఈ క్రమంలో పలువురు నాయకులను నియమించారు.పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయపరుస్తూ కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర జనసేన కార్యవర్గం తెలియజేయడం జరిగింది.







