నారా లోకేష్‌కు సారీ చెప్పిన ది వీక్‌ మ్యాగజైన్‌

టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌కు ప్రముఖ మ్యాగజైన్‌ ద వీక్‌ క్షమాపణ చెప్పింది.నవంబర్‌ 17న ఈ మ్యాగజైన్‌లో ఓ కథనం ప్రచురితమైంది.ఫ్రీ లంచ్‌ పేరుతో ప్రచురితమైన ఆ కథనంలో లోకేష్‌పై ఆ మ్యాగజైన్‌ నిరాధార ఆరోపణలు చేసింది.2017 నుంచి 2019 వరకూ విశాఖ ఎయిర్‌పోర్టులో కేవలం స్నాక్స్‌ పేరు చెప్పి రూ.15 లక్షల బిల్లు చేశారని, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ది వీక్‌ చెప్పింది.

 Theweak Magazine Nara Naralokesh-TeluguStop.com

అయితే ఈ బిల్లు మొత్తం కేవలం అప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్‌, ఆయన టీమ్‌ చేసిందే అన్నట్లుగా ఆ మ్యాగజైన్‌ ఆరోపించింది.

కానీ ఈ రెండేళ్లలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వేలాది మంది ప్రొటోకాల్‌ గెస్ట్‌ల కోసం అందించిన స్నాక్స్‌కు ఇంత మొత్తం అయినట్లు ది వీక్‌ ఇప్పుడు చెబుతోంది.దీనికి సంబంధించిన ఆధారాలను లోకేష్‌ కార్యాలయం తమకు అందించినట్లు ఆ మ్యాగజైన్‌ ఓ వివరణను ప్రచురించింది.

Telugu Chandrababu, Lokesh, Weak Magazine, Ys Jagan-Political

లోకేష్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ ఇలాంటి తప్పుడు కథనాన్ని ప్రచురించినందుకు క్షమాపణ కోరింది.నిజానికి ఈ అంశాన్ని వైసీపీ వాళ్లు కూడా బాగానే వాడుకున్నారు.చినబాబు చిరుతిండికి లక్షలు ఖర్చయ్యాయంటూ జగన్‌ పత్రిక కూడా అప్పట్లో ఓ కథనం రాసింది.దీనిపై టీడీపీ వాళ్లు వివరణ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube