సర్కారు వారి పాట విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది: సూపర్ స్టార్ మహేష్ బాబు

”ఇది సక్సెస్ సెలబ్రేషన్ లా లేదు.వంద రోజుల వేడుక చేసుకున్నట్లు వుంది.

 Sarkaru Vari Paata Movie Mahesh Babu Success Celebrations Krunool Details, Sarka-TeluguStop.com

సర్కారు వారి పాట విజయం ఎప్పటికీ గుర్తిండిపోతుంది’ అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’.

మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది.అన్నివర్గాల ప్రేక్షకులు అలరించి ప్రపంచవ్యాప్తంగా నాగులు రోజుల్లో 153+ కోట్లు వసూళు చేసి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ సహా చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు.ఈ వేడుకలో ఒక మాస్ మూమెంట్ చోటు చేసుకుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ… ”ఒక్కడు సినిమా షూటింగ్ జరిగినప్పుడు కర్నూల్ వచ్చాను.రెండు రోజుల వ్యవధిలో సర్కారు వారి పాట వేడుక ఇక్కడ పెట్టుకున్నాం.

ఐతే ఇంత మంది వస్తారని అనుకోలేదు.మీ అందరినీ చూసిన ఉత్సాహంలో స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేశాను.

ఇది మీ కోసమే.మీ అభిమానం ఎప్పుడు ఇలానే వుండాలి.

ఇది సక్సెస్ మీట్లా లేదు.వంద రోజులు వేడుక చేసుకున్నట్లు వుంది.

సర్కారు వారి పాట మా ఫ్యామిలీతో చూసినప్పుడు మా అబ్బాయి గట్టిగా హాగ్ చేసుకున్నాడు.సితార పాప అన్ని సినిమాల్లో కంటే ఇందులో బాగా చేశానని, అందంగా వున్నాని చెప్పింది.

నాన్నగారు చూసి .పోకిరి దూకుడుకి మించిపొతుందని అన్నారు.ఈ క్రెడిట్ దర్శకుడు పరశురాంకి దక్కుతుంది.ఈ సినిమాని అంత చక్కగా డిజైన్ చేశారు.ఈ సినిమా కోసం ప్యాండమిక్ లో చాలా కష్టపడ్డాం.

Telugu Ananth Sriram, Parasuram Petla, Keerthy Suresh, Krunool, Mahesh Babu, Tha

కానీ ప్రేక్షకులు ఇచ్చిన విజయం ఆ కష్టాన్ని మర్చిపోయాం.ఈ సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్ కి థ్యాంక్స్.కీర్తి సురేష్ అద్భుతంగా చేసింది.

సముద్రఖని గారు కూడా చక్కగా చేశారు.తమన్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు.

మైత్రీ మూవీ మేకర్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే.సర్కారు వారి పాటని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

నేను వాళ్లకి శ్రీమంతుడు ఇచ్చాని ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతుంటారు.కానీ ఈ రోజు నాకు సర్కారు వారి పాట లాంటి ఘన విజయం ఇచ్చారు.

డిస్ట్రిబ్యూటర్స్ ని ఇక్కడ చూడటం ఆనందంగా వుంది.సర్కారు వారి పాట విజయం ఎప్పటికీ గుర్తిండిపోతుంది.

నాన్నగారి ఫ్యాన్స్, నా అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లో వుంటారు.ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ అందరికీ కృతజ్ఞతలు” అన్నారు

Telugu Ananth Sriram, Parasuram Petla, Keerthy Suresh, Krunool, Mahesh Babu, Tha

దర్శకుడు పరశురాం మాట్లాడుతూ.మహేష్ బాబు గారి ఒక్కడు సినిమా చూసి డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను.మహేష్ బాబు గారిని సినిమా దర్శకత్వం వహించి, సినిమా విజయోత్సవం కర్నూల్ లో జరుగుకోవడం అనేది నాకు లైఫ్ టైం గిఫ్ట్.

మహేష్ బాబుగారికి థ్యాంక్స్ చెప్పడం చిన్న మాట.మహేష్ గారిని ఎంత ప్రేమిస్తానో మాటల్లో చెప్పలేను.మహేష్ గారికి మంచి సినిమా ఇస్తానని మాటిచ్చాను.ఆ మాట సర్కారు వారి పాటతో నిలబెట్టుకోవడం చాలా ఆనందంగా వుంది.సంగీత దర్శకుడు తమన్, డీవోపీ మధి, ఎడిటర్ మార్తండ కే వెంకటేష్, అనంత్ శ్రీరాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ టీం చందు, రాజు,శేఖర్ .అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను.సర్కారు వారి పాట ని ఇంత స్థాయిలో తీర్చిదిద్దిన నిర్మాతలు నవీన్ గారు, రవి గారు, గోపి గారు, రామ్ గారు, జీఏంబీ ఎంటర్టైన్మెంట్ తరపున నమ్రతగారికి స్పెషల్ థ్యాంక్స్.ఈ సినిమాని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అన్నారు.

Telugu Ananth Sriram, Parasuram Petla, Keerthy Suresh, Krunool, Mahesh Babu, Tha

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.మహేష్ గారి ఫిగర్ క్లాస్.కానీ ఆయనకి వచ్చే కలెక్షన్స్ మాత్రం మాస్.ఈ సినిమాకి అనంత్ శ్రీరామ్ చక్కని సాహిత్యం అందించారు.నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అద్భుతమైన సహకారం ఇచ్చారు.ఈ ఆల్బమ్ క్రెడిట్ దర్శకుడు పరశురాం కి ఇస్తాను.ఆయన లేకపోతే ఇంత చక్కని ఆల్బం వచ్చేది కాదు.మహేష్ బాబుగారి పై వున్న ఇష్టాన్ని పాటల్లో చూపించారు.ఈ సక్సెస్ కారణం మహేష్ బాబు గారే.

ఆయన నింపిన ఎనర్జీ మామూలుది కాదు.మ్యూజిక్ చేసినప్పుడు కీ బోర్డులు పగిలిపోయేవి.

అంత ఎనర్జీ ఆయనలో వుంది.దూకుడు నుండి మా ప్రయాణం.

ఆయన ఒకొక్క సినిమాకి రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నారు.ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్.

గీత రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.సర్కారు వారి పాట కోసం చెప్పకురా తోలు తొక్క.తప్పదు నా వడ్డీ లెక్క” అని రాశాను.ఆ పాటలో అన్నట్టుగానే ఇదు రోజుల్లోనే అసలు మొత్తం వసూళు చేసి, వడ్డీ మీద బారు వడ్డీ దానిమీద చక్రవడ్డీ సినిమా వసూళు చేసుకుంటూ సర్కారు వారి పాట దూసుకుపోతుంది.

అభిమానులు గర్జనలు చూస్తుంటే ఈ విజయం ఇక్కడితో ఆగేలాలేదు.ఈ సినిమాలో ఐదు పాటలు రాసే అవకాశం ఇచ్చి, ప్రతి పాట రాయడానికి ఊతనిచ్చిన దర్శకుడు పరశురాం గారికి ధన్యవాదాలు.

సంగీత దర్శకుడు తమన్ గారికి నా కృతజ్ఞతలు.ఈ సినిమాని భుజస్కందాలపై మోసి ఇంత గొప్ప విజయానికి కారణమైన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వేవేలా ప్రణామాలు.

సర్కారు వారి పాటని ఇంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు కృతజ్ఞతలు” తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube