హైదరాబాదు నగరం రోజురోజుకి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.ఇందులో ముఖ్యంగా చదువుకోవడానికి వస్తున్నటువంటి యువతే ప్రధాన లక్ష్యంగా చేసుకొని కొంతమంది వ్యభిచార గృహ నిర్వాహకులు అందమైన యువతలను ఎరగా వేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.
తాజాగా ఓ ప్రముఖ పబ్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన ఘటన మరువక ముందే మరో వ్యభిచార నిర్వాహక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
వివరాల్లోకి వెళితే ఎస్ఆర్ నగర్లో నివాసముంటున్నఇద్దరు యువకులు ఓ ప్రముఖ వెబ్ సైట్ ఆధారంగా చేసుకొని అందమైన యువతుల ఫోటోలు ఉంచి అందులో విటులు ఎంచుకున్న యువతులను వారికి సరఫరా చేస్తూ అడ్డదారిలో డబ్బులు సంపాదించకుంటున్నరు.
ఇందులో భాగంగా విటులకు ఎంచుకున్న యువతులను వారికి సరఫరా చేస్తూ గంటకు దాదాపు 5 వేల నుంచి 10వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.
అయితే స్థానికుల నుంచి పోలీసులకి సమాచారం రావడంతో పోలీసులు ఆ యువకులు ఉన్నటువంటి నివాసం పై దాడి చేశారు.ఈ దాడిలో ఓ యువకుడు పోలీసులకి చిక్కగా మరో యువకుడు పరారీలో ఉన్నాడు.అలాగే ఆ నివాసంలో వ్యభిచారంలో పాల్గొంటున్నటువంటి మరో నలుగురు యువకులను మరియు యువతులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అంతేగాక పరారీలో ఉన్నటువంటి మరో నిందితుడి కోసం పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.