సనాతన ధర్మం ఒక రోగం లాంటిది దానిని నిర్మూలించాలి అంటూ నీచమైన మాటలు మాట్లాడిన తమిళనాడు చెపాక్ నియోజకవర్గం యం.యల్.
ఏ మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ ని వెంటనే అరెస్ట్ చెయ్యలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చినేపల్లి కిరణ్ కుమార్ యస్వి యునివర్శిటి పోలీష్ స్టేషన్ నందు పిర్యాదు చేశారు.మంత్రి స్టాలిన్ ను పంది తో పోలుస్తూ చిత్రాలను విడుదల చేసి అనంతరం తగలబెట్టారు.
స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేతలు.దేశంలో ఆశాంతిని సృష్టించి ఎన్నికల సమయంలో లబ్ది పోందాలని చూస్తున్న స్టాలిన్ ను తీవ్రవాదిగా గుర్తించి వెంటనే అరెస్టు చేయాలనీ స్టాలిన్ చిత్రాన్ని కాల్చి నిరసన తెలియజేశారు.
రాజ్యాంగ బద్దమైన యం.యల్.ఏ గా ఉంటూ సనాతన ధర్మాన్ని కరోనా, డెంగ్యూ లాంటి రోగాలతో పోల్చుతూ రోగాలను నిర్మూలించినట్టు సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి అని అనడం అతనిలోని పైసాచికత్వానికి నిదర్శనం అని మండిపడ్డారు.పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదనీ, తన తల్లి ఎంతో భక్తితో పూజలు చేస్తూ గుడులకు వెలుతుంటే తనను తాను క్రిస్టియన్ గా ప్రకటించుకొన్న నీచుడు తన తల్లితో పాటు ప్రపంచంలోని హిందువులను అవమానపరుస్తూ వారి మనోబావాలు దెబ్బతీసేలా మాట్లాడటం దౌర్భాగ్యం అని అన్నారు.
తనను యం.యల్.ఏ పదవికి శాస్వతంగా రాజకీయాల నుండి తొలగిస్తూ అరెస్ట్ చెయ్యలనీ డిమాండ్ చేశారు.ఇలాంటి మాటలు ఇంకెవ్వరూ మాట్లాడకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.