కళ్యాణ్ రామ్ 'డెవిల్' నుండి సంయుక్త ఫస్ట్ లుక్.. బర్త్ డే పోస్టర్ అదిరింది!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) టాలీవుడ్ హీరోల్లో ఒకరు.ఇతడు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దాలు గడుస్తున్న స్టార్ హీరో కాలేక పోయాడు.

 Samyukta Menon First Look Release From Kalyan Ram Devil, Samyukta Menon, Kalyan-TeluguStop.com

కానీ ఈ మధ్య ఇతడికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో కెరీర్ మారిపోయింది.కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా ‘బింబిసార‘ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.

అయితే ఈ సీక్వెల్ ఇంకా పట్టాలెక్క లేదు.దీంతో ఈ సీక్వెల్ పక్కన పెట్టి మళ్ళీ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు.

కళ్యాణ్ రామ్ బింబిసార నుండి ప్రయోగాత్మక సినిమాలను చేస్తూ వస్తున్నాడు.ఇటీవలే అమిగోస్ సినిమా( Amigos )తో వచ్చి పర్వాలేదు అనిపించుకున్నాడు.

Telugu Amigos, Devil, Kalyan Ram, Samyukta Menon, Samyuktamenon, Tollywood-Movie

ఇక ఇప్పుడు ‘డెవిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.టీజర్ తో సాలిడ్ బజ్ ను అందుకున్న ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతుంది.ఒక ప్రముఖ స్పై జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే డీసెంట్ బజ్ నెలకొంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి హీరోయిన్ గా నటిస్తున్న సంయుక్త మీనన్( Samyukta Menon ) ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

Telugu Amigos, Devil, Kalyan Ram, Samyukta Menon, Samyuktamenon, Tollywood-Movie

ఈ రోజు ఈ భామ పుట్టిన రోజు జరుపు కుంటున్న నేపథ్యంలో ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.‘నైషధ’ అనే రోల్ లో ఈమె నటిస్తున్నట్టుగా తెలిపారు.అమ్మడు గెటప్ ఆకట్టుకుంటూ ప్లెజెంట్ గా ఉంది.ఇక ఈ సినిమాను నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నాడు.కాగా హర్ష వర్ధన్ రామేశ్వర్( Harshavardhan Rameshwar ) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.నవంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube