జనసేన అద్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఈసారి తెలంగాణ ఎన్నికలపై కూడా దృష్టి సారించిన సంగతి తెలిసిందే.బీజేపీతో కలిసి జనసేన పార్టీని తెలంగాణ ఎన్నికల బరిలో నిలిపారు.
అయితే జనసేన తెలంగాణలో పోటీ చేస్తున్నప్పటికి ఈ ఎన్నికలను ఆయన లైట్ తీసుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగా జరుగుతోంది.ఎందుకంటే ఏపీలో ఉన్నంతా యాక్టివ్ గా తెలంగాణ రాజకీయాలపై లేరాయన.
బీజేపీ పెద్దల మేరకే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ ఇప్పటికే తేల్చి చెప్పారు కూడా.దాంతో మొత్తంమీద తెలంగాణ ఎన్నికలను పవన్ నామమాత్రంగా తీసుకున్నారనే వాదన రోజురోజుకూ బలపడుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోతే బీజేపీకి ( BJP )కూడా ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ఇటీవల పవన్ ప్రచారానికి సిద్దమయ్యారు.బీజేపీ జనసేన అభ్యర్థుల తరుపున తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్న పవన్.చేస్తున్న ప్రసంగాలలో ఏ మాత్రం పస కనిపించడం లేదని స్పష్టంగా అర్థమౌతోంది.ఏపీలో తనదైన రీతిలో ఘాటు విమర్శలతో అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసే పవన్ తెలంగాణలో మాత్రం ఏదో తూ తూ మంత్రంగానే ప్రచారాలు నిర్వహిస్తున్నారు తప్పా తన మార్క్ చూపించడం లేదనే వాదన వినిపిస్తోంది.
తెలంగాణలో అవినీతి జరుగుతోందని, భవిష్యత్ లో తెలంగాణలో కూడా జనసేన ప్రభావం ఉంటుందని, తాను తెలంగాణలో అవినీతి రహిత పాలన కోరుకుంటున్నానని చెప్పిన పవన్ తన ప్రసంగాల్లో ఎక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీని ప్రస్తావించాలేదు.

ఎందుకంటే బిఆర్ఎస్ లోని కేటిఆర్, కేసిఆర్( KTR KCR ) లతో పవన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి.అందుకే వ్యూహాత్మకంగా పవన్ బిఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాలేదని కొందరు రాజకీయవాదులు చెబుతున్నారు.కాగా ఏపీలో కూడా బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ టీడీపీతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
అలాగే తెలంగాణలో కూడా సేమ్ ప్లాన్ అమలు చేస్తూ బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికి బిఆర్ఎస్ తో సానుకూలంగా వ్యవహరించేలా పవన్ వైఖరి ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.మరి తెలంగాణ ఎన్నికల్లో పవన్ ప్రభావం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.