సైరాకు మరీ అతి చేస్తున్నారు

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ భారీ అంచనాల నడుమ, భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది.సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

 Saira Narasimha Reddy Movie Over Budget-TeluguStop.com

ఇప్పటి వరకు ఈ చిత్రంకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.ప్రస్తుతం ఈ చిత్రం యాక్షన్‌ సీన్స్‌ను, ముఖ్యంగా యుద్ద సన్నివేశాలను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక ఈ యుద్ద సన్నివేశాల షెడ్యూల్‌కు ఏకంగా చిత్ర యూనిట్‌ సభ్యులు 45 కోట్లను కేటాయించినట్లుగా సమాచారం అందుతుంది.

రెండు నెలల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు మొత్తంగా 45 కోట్లను కేటాయిస్తున్నట్లుగా మెగా వర్గాల నుండి సమాచారం అందుతుంది.తెలుగు సినిమాల్లో ఇంతటి భారీ యాక్షన్‌ సీన్స్‌ అంటే మరీ ఎక్కువ, ఇటీవలే ‘సాహో’ చిత్రం కోసం దుబాయిలో ఏకంగా 90 కోట్లతో యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరించారు.ఇప్పుడు దాదాపు అదే స్థాయిలో సైరాకు యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

ప్రభాస్‌ సినిమాకు అంతటి భారీ యాక్షన్‌ సీన్స్‌ చేస్తున్నారనే ఉద్దేశ్యంతో సైరాకు కూడా ఇంతగా ఖర్చు చేయడం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

మొన్నటి వరకు సైరా చిత్రాన్ని 125 కోట్ల నుండి 150 కోట్ల మద్యలో చిత్రీకరించాలని భావించారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం బడ్జెట్‌ 200 కోట్లు దాటబోతుందని తెలుస్తోంది.తెలుగుతో పాటు బాలీవుడ్‌ మరియు తమిళంలో కూడా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని అంత బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు.

ఇంత బడ్జెట్‌తో సినిమా అంటే ఖచ్చితంగా సాహసమే.ఒకవేళ సినిమా ఫలితం తారుమారు అయితే కనీసం 50 కోట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు.

అందుకే చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా కాస్త కంగారు పడుతున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సైరా’ చిత్రం షూటింగ్‌ను అన్ని విధాలుగా కూడా భారీతనం కలిగి ఉండేలా చిత్రీకరిస్తున్నారు.చిరంజీవికి ఇప్పటికి కూడా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండటంతో పాటు, యువ హీరోల స్థాయలో సత్తా చాటగల ప్రతిభ ఉందని ‘ఖైదీ నెం.150’ చిత్రంతో వెళ్లడైంది.అందుకే సైరా చిత్రంను 200 కోట్ల బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు అంటూ కొందరు అంచనా వేస్తున్నారు.2019 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube