మెగా మేనల్లుడుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ హీరో మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.అయితే స్టార్ హీరో అవుతాడు అనుకున్న సమయానికి సాయి ధరమ్ తేజ్ సినిమాలు అన్ని ప్లాప్ లు అవుతూ వచ్చాయ్.
ఇక అయిపోయింది అనుకున్న సమయానికి చిత్రలహరితో మంచి హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.ఇక గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయిన ప్రతిరోజు పండగే సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా లాక్ డౌన్ కాలంగా ఇంతకాలం విడుదల అవ్వలేదు.అయితే ఈ నెల 25న ఈ సినిమా విడుదల కానుంది.అలాంటి ఈ సుప్రీం హీరో విజయవాడలో నిన్న వృద్ధాశ్రమంలో సందడి చేశారు.విజయవాడలోని వాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవా సమితి వృద్ధాశ్రమంకు ఆయన వెళ్లారు.
అక్కడ ఏర్పాటు చేసిన ఒక విగ్రహాన్ని అయన ఆవిష్కరించారు.
అయితే గత ఏడాది అమ్మ ప్రేమ ఆదరణ సేవా సమితి వృద్ధాశ్రమానికి సహాయం చెయ్యాలని ట్విట్టర్ ద్వారా సాయి ధరమ్ తేజ్ ను సంప్రదించగా ఆ ట్విట్ కు సానుకూలంగా స్పందించిన తేజు ఆ భవంతిని పూర్తి చెయ్యడానికి ఏడాది కాలంపాటు ఆశ్రమంలో ఆహారం తాను సరఫరా చేస్తానని మాటిచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆ భవంతిని పూర్తి చేశారు.ఇంకా సాయి ధరమ్ తేజ్ పిలుపు మేరకు మెగా అభిమానులు సైతం లక్ష రూపాయిల విరాళం అందించారు.
అంతేకాదు.భవిష్యత్తులో ఇలాంటి సేవ కార్యక్రమాలు మరిన్నీ చేస్తానని అయన చెప్పారు.
ఈ వృద్ధాశ్రమానికి తన స్నేహితులు కూడా సహాయం అందించినట్టు ఆయన తెలిపారు.