బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారారు.ఈ క్రమంలోనే పటాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సద్దాం యాదమ్మ రాజు వంటి వారు జబర్దస్త్ కార్యక్రమంలోకి ఎంటర్ ఇచ్చి ఈ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందారు.
అయితే నాగబాబు ఎప్పుడైతే ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారో ఆ క్షణం నుంచి ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్లు ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమం వదిలి వెళ్ళిపోయారు.జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్స్ ఇతర ఛానల్లో పలు కార్యక్రమాలలో బిజీ అయ్యారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో వచ్చినటువంటి క్రేజ్ ఇతర కార్యక్రమాలలో రాకపోవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే ఆ కార్యక్రమాలకు ఆదరణ లేక ఆ కార్యక్రమాలను తీసివేయడంతో తిరిగి ఒక్కొక్కరు జబర్దస్త్ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇస్తున్నారు.ఈ క్రమంలోనే సద్దాం యాదమ్మ రాజు వంటి వారందరూ కూడా స్టార్ మా లో పలు కార్యక్రమాల ద్వారా సందడి చేశారు.
కామెడీ స్టార్స్ కార్యక్రమం పెద్దగా ఆదరణ సంపాదించుకోకపోవడంతో తిరిగి జబర్దస్త్ లోకి వచ్చారు.తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఈ ప్రోమోలో భాగంగా సద్దాం యాదమ్మ రాజు వంటి వారు సందడి చేశారు.సద్దాం,యాదమ్మ రాజు స్టార్ మాకు, కామెడీ స్టార్స్ కార్యక్రమానికి గుడ్ బై చెబుతూ జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.తాజాగా వీరు చేసిన స్కిట్ లో భాగంగా ఇది మాతృ సంస్థ, తల్లి లాంటిది కాబట్టి మళ్లీ వెనక్కి వచ్చామంటూ స్కిట్లో భాగంగా డైలాగ్ చెప్పారు.మొత్తానికి యాదమ్మ రాజు, సద్దామ్ జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.