మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ కుర్ర హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.ఈయన ఇది వరకు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసేవాడు.
కానీ ఇప్పుడు అలా కాదు ఒకటి పూర్తి అవ్వకుండానే మరొకటి చేస్తూ ఫుల్ స్పీడ్ గా ఉన్నాడు.ప్రెసెంట్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా ఆచార్య.
ఈ సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.
ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించాడు.చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.
వీరిద్దరూ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రొమోషన్స్ స్పీడ్ గా చేయాలనీ మేకర్స్ నిర్ణయించారు.
దీంతో వరుసగా ఈ సినిమా నుండి అప్డేట్ లు ఉండేలా చూసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ చూసిన మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.ఇక ఆ తర్వాత నిన్న ఈ సినిమా నుండి సాంగ్ ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ లో చిరంజీవి.చరణ్ డ్యాన్స్ తో అదరగొట్టారు.
వీరిద్దరిని ఒకే పాటలో పక్కపక్కన చూస్తుంటే మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉంది.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మరొక అప్డేట్ బయటకు వచ్చింది.
తాజాగా ఈ సినిమా టోటల్ రన్ టైమ్ ఎంతో బయటకు వచ్చింది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 166 నిముషాల నిడివి తో కట్ చేశారట.
అంటే మొత్తం 2 గంటల 46 నిముషాలు అన్నమాట.మరి ఈ రన్ టైమ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.మ్యాట్నీ మూవీ మేకర్స్, కొణిదెల ఎంటెర్టైన్మమెంట్స్ కంపెనీ సంయుక్తంగా నిర్మించారు.