యాక్షన్, రీవేంజ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "రుద్ర సింహ" షూటింగ్ పూర్తి

KM ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్.స్నేహ, మైత్రి, హీరో, హీరోయిన్లు గా మనోహర్ కాటేపోగు దర్శకత్వంలో మనోహర్ కాటేపోగు, ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్ రావు జింకల లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న యాక్షన్, రీవేంజ్ డ్రామా చిత్రం “రుద్ర సింహ”.ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొంది.త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

 Rudra Sinha Shooting Is Over , Santosh , Rudra Sinha Movie ,sneha , Mythri , Ma-TeluguStop.com

ఈ సందర్భంగా నిర్మాతలు మనోహర్ కాటేపోగు, ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్ రావు జింకల మాట్లాడుతూ…ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ ,రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో వస్తున్న ఈ సినిమాలో ఏడు పాటలు, ఐదు ఫైట్స్ ఉన్నాయి.

ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ కూడా కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఎంతో థ్రిల్ ఫీల్ అవుతారు.ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా చక్కగా కుదిరారు.

వారంతా సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది.మంచి కథతో వస్తున్న దర్శకుడు మనోహర్ కాటేపోగు ఫ్యూచర్ లో పెద్ద దర్శకుడు అవుతాడు.

ఈ సినిమాకు రాజేష్ రాజ్ టి మంచి మ్యూజిక్ ఇచ్చాడు.ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube