ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్, తారక్ హీరోలని తెలియదు.. శ్రియ షాకింగ్ కామెంట్స్ వైరల్!

క్రిటిక్స్ నుంచి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ వీక్ డేస్ లో కూడా భారీస్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.బీ, సీ సెంటర్లలో ఈ సినిమా కలెక్షన్లు అనుకున్న స్థాయిలో లేకపోయినా ఏ సెంటర్లలో మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీ హవా కొనసాగుతోంది.

 Rrr Star Shriya Saran Could Not Get Tickets For Rrr Film In Mumbai ,  Interestin-TeluguStop.com

ఎన్టీఆర్, చరణ్ తమ అద్భుత నటనతో ఆర్ఆర్ఆర్ సక్సెస్ కు కారణమయ్యారు.ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ తల్లి పాత్రలో శ్రియ నటించారనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మీడియాతో ముచ్చటించిన శ్రియ ఆర్ఆర్ఆర్ మూవీకి తనకు టికెట్లు దొరకడం లేదని ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయని వెల్లడించారు.ఛత్రపతి సినిమా తర్వాత రాజమౌళితో ఆర్ఆర్ఆర్ మూవీ కోసం పని చేయడం సంతోషాన్ని కలిగిస్తోందని శ్రియ పేర్కొన్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీలో సరోజిని పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రియ ఛత్రపతి మూవీ తన కెరీర్ లో సూపర్ హిట్ అని అన్నారు.

Telugu Chhatrapati, Jr Ntr, Mumbai, Rajamouli, Ram Charan, Rrr Tickets, Shriyasa

ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని అలా ఎదురుచూస్తున్న సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీలో సరోజిని పాత్ర దక్కిందని శ్రియ అన్నారు.భవిష్యత్తులో కూడా ఛాన్స్ వస్తే రాజమౌళి సినిమాల్లో కచ్చితంగా నటిస్తానని రాజమౌళి బృందంతో మరోసారి కలిసి పని చేయడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.రాజమౌళి సినిమా అనగానే ఈ సినిమాకు సంతకం చేశానని ఈ సినిమాలో నటీనటులెవరనే విషయం కూడా అడగలేదని ఆమె అన్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రారంభమైన తర్వాత చరణ్, తారక్ ఈ సినిమాలో హీరోలని తెలిసిందని అప్పటివరకు ఈ విషయం తనకు తెలియదని శ్రియ చెప్పుకొచ్చారు.ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్, తారక్ స్టార్ డమ్ కు సరిపడా హిట్ వచ్చిందని ఆమె తెలిపారు.

వచ్చే వారమైనా ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్లు దొరుకుతాయని ఆశిస్తున్నానని ఆమె అన్నారు.శ్రియ ఆర్ఆర్ఆర్ మూవీ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube