మీ జుట్టు హెవీగా ఊడిపోతుందా.? అధిక హెయిర్ ఫాల్ కారణంగా కురులు రోజురోజుకు పల్చగా మారుతున్నాయా.? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడం ఆగడం లేదా.? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.నిజానికి మన వంటింట్లో ఉండే కొన్ని కొన్ని పదార్థాలతో చాలా సులభంగా హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టవచ్చు.జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చు.ముఖ్యంగా అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కలబంద( Aloe vera ) ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక ఉల్లిపాయ( Onion )ను కూడా తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కలబంద ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ విటమిన్ ఈ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల ఆముదం( Ricinus ) వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు బాగా అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట లేదా రెండు గంటల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే జుట్టు ఎంత అధికంగా రాలుతున్న దెబ్బకు కంట్రోల్ అవుతుంది.
అదే సమయంలో కలబంద, ఉల్లిపాయ, ఆముదం మరియు విటమిన్ ఈ ఆయిల్ జుట్టు ఎదుగుదలను చక్కగా ప్రోత్సహిస్తాయి.ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా చేస్తాయి.జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి.కాబట్టి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలి అని భావించేవారు ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ఈ సింపుల్ రెమెడీని ఫాలో అవ్వండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







