కొందరు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారు.ఇంకొందరు విధిలేని పరిస్థితుల్లో చనిపోవాలని భావిస్తారు.
వారు తాము కొన్నేళ్లుగా ఏదో ఒక రోగం వల్ల ఇబ్బందులు పడుతూ ఆ బాధను అనుభవించలేక మెర్సీ కిల్లింగ్( Mercy killing ) కోసం నిరీక్షిస్తుంటారు.కొన్ని సార్లు కోర్టుల్లో కొన్ని ఇలాంటి ప్రత్యేక పిటిషన్లు చూస్తుంటాం.
తాము విధిలేని పరిస్థితుల్లో చనిపోవాలని అనుకుంటున్నామని, తమకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్లు కోర్టులను కోరుతుంటారు.మన దేశంలో కోర్టులు సాధారణంగా ఇలాంటి పిటిషన్లకు అనుమతి ఇవ్వవు.
అయితే న్యూజిలాండ్‌లో( New Zealand ) మాత్రం ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో రోగికి చనిపోయేందుకు కోర్టులు పర్మిషన్ ఇస్తాయి.ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వ్యక్తులు సెనైడ్ క్యాప్సూల్ మింగి చనిపోతారు.
ఇది కొంచెం బాధాకరంగా ఉంటుంది.అయితే ఓ వ్యక్తి ఇలాంటి వారి కోసం ఓ మెషీన్ తయారు చేశాడు.
అందులో కూర్చుని ఎలాంటి బాధ లేకుండా హాయిగా చనిపోవచ్చట.దీని గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఫిలిప్( Philip ) అనే వ్యక్తి ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ( Exit International )అనే కంపెనీని స్థాపించాడు.తన కంపెనీ ద్వారా ఆయన ఓ మెషీన్ తమారు చేశాడు.సూసైడ్ పాడ్( Suicide Pod ) అనే మెషీన్‌లో వ్యక్తులు కూర్చుంటే అది బాధ లేని చావును కేవలం ఒక సెకనులో అందిస్తుంది.
ఇందులో ఉన్న వ్యక్తి చనిపోవడానికి సమ్మతి తెలిపేందుకు ఒకసారి కనురెప్ప వేస్తే సరిపోతుంది.శవపేటిక లాంటి ఈ మెషీన్‌లో వ్యక్తి పడుకోగానే స్విచ్ ఆన్ చేయొచ్చు.

తర్వాత ఆ మెషీన్‌లో నైట్రోజన్ గ్యాస్ లీక్ అవుతుంది.దీంతో అందులో ఉండే గాలిలో ఆక్సిజన్ శాతం 21 నుంచి సున్నాకు పడిపోతుంది.గాలిలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల కాసేపటికే ప్రాణం పోతుంది.
అయితే ఇందులో ఉండే వ్యక్తులు ఎలాంటి బాధ లేకుండా నవ్వుతూ చనిపోయే అవకాశం ఉంటుంది.‘డాక్టర్ డెత్’( Doctor Death ) అని కూడా పిలువబడే ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే ఈ ఆత్మహత్య యంత్రాన్ని కనుగొన్నారు.
ఈ యంత్రంతో గత సంవత్సరం స్విట్జర్లాండ్‌లో డిగ్నిటాస్, ఎగ్జిట్ వంటి కంపెనీలు ఇటువంటి పరికరాలను ఉపయోగించి సుమారు 1,300 మంది స్వచ్ఛందంగా చనిపోయారు.







