టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.
ఎట్టకేలకు ఈ సినిమా విడుదల అయి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాకు, డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.సినిమా విడుదల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
థియేటర్ల వద్ద అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి వాటికి పాలాభిషేకాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు థియేటర్ల దగ్గర పండుగ చేస్తుండగా ఒక వ్యక్తి మాత్రం గన్ తో హల్ చల్ చేశాడు.
తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రసారం అవుతున్న థియేటర్లోకి ఒక వ్యక్తి గన్నుతో థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చి తుపాకీ చేతిలో పట్టుకుని అటూ ఇటూ తిరగడంతో కొంతమంది ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఈ విషయంపై దర్యాప్తు చేయగా అతడి చేతిలో ఉన్నది బొమ్మ తుపాకీ గా అనుమానిస్తున్నారు.

మరి ఆ వ్యక్తి ఎందుకు గన్ తో థియేటర్ వద్ద హల్ చల్ చేస్తున్నాడు అన్న విషయం తెలియాల్సి ఉంది.ప్రస్తుతం థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా చిత్రబృందం ప్రస్తుతం సక్సెస్ మీట్ లో భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు అభిమానులు పలువురు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరీ ముఖ్యంగా హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.