భారత్ నుంచీ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఎంతో మంది భారతీయులు వలసలు వెళ్లి అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఆర్ధికంగా స్థిరపడ్డారు.తమవద్దనున్న ఆర్ధిక వనరులతో ఎన్నో రూపాలలో పెట్టుబడులు పెడుతూ మరింత బలమైన ఆర్ధిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు.
అంతేకాదు తమ సొంత రాష్ట్రాలు, గ్రామాలలో పెట్టుబడులు పెడుతూ రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. కంపెనీలు, ఫ్యాక్టరీ లు ఇలా పలు రంగాలలో పెట్టుబడులు పెడుతున్న ఎన్నారైలు తాజాగా తమ రూటును రియలెస్టేట్ రంగంవైపుకు మార్చారు.
ఒక్కసారిగా ఎన్నారైలు ఎందుకు రియల్ రంగం వైపుకు మళ్ళిందంటే అందుకు రీజన్ లేకపోలేదు.
అమెరికన్ డాలర్ కంటే కూడా రూపాయి విలువ తగ్గుతున్న నేపధ్యంలో ఇప్పటి వరకూ పెట్టుబడులు పెడుతున్న ఎన్నారైలు రియల్ రంగలోకి తమ పెట్టుబడులను మళ్ళిస్తున్నారని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ నేపద్యంలో భారత్ లో ఆర్ధిక పరిస్థితి పెట్టుబడి దారులకు అనుకూలంగా మారుతోంది.కేవలం రియల్ రంగం భారత్ లో సుదీర్ఘమైన ఆర్ధిక బలాన్ని అందిస్తోంది కాబట్టి ఎన్నారైలు వెనక్కి తగ్గడంలేదు.ఇదిలాఉంటే.
గల్ఫ్ దేశంలో భారతీయ ఎన్నారైల హవా ఎక్కువగా ఉంటుంది.పైగా అక్కడి కరెన్సీ విలువ కూడా డాలర్ పై ఆధారపడి ఉంటుంది.దాంతో ఆయా దేశాలలో ఉన్న భారత ఎన్నారైలు అక్కడి రియల్ రంగంలో పెట్టుబడులను ఉపసంహరించుకుని మరీ భారత్ లో రియల్ రంగంలో పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి.ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, పూణే, వంటి ప్రముఖ నగరాలలో పెట్టుబడులు అత్యధికంగా పెడుతున్నారని తెలుస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాలలో వైజాగ్, హైదరాబాద్, వంటి నగరాలలో పెట్టుబడులు పెడుతున్నారని ఎన్నారైలు.బీచ్ లు హిల్ స్టేషన్స్ వంటి ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ఆసక్తిని చూపుతున్నారని తెలుస్తోంది.