తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశ్యం తో రకరకాల వ్యూహాలకు పదునుపెడుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇక ఇప్పటి వరకు రకరకాల కనిపించని సమస్యలపై సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇక బడ్జెట్ లో ఉన్న లోపాలే టార్గెట్ గా టీఆర్ఎస్ పై విరుచుక పడే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకంటే ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించడానికి దీనిని మించిన అవకాశం మరొకటి ఉండే అవకాశం లేదు కాబట్టి అంతేకాక బడ్జెట్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఇక వచ్చే ఎన్నికల్లో మరల బడ్జెట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది.అయితే బడ్జెట్ పై మాత్రం అంతగా వ్యతిరేకత రానప్పటికీ వీటిని ఖచ్చితంగా నెరవేరిస్తే ప్రజల్లో టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున అనుకూల పవనాలు వీచే అవకాశం ఎక్కువగా ఉంది.
అయితే అవరోధాలను తనకనుకూలంగా మలుచుకోవడంలో సిద్దహస్తుడైన కెసీఆర్ ఎన్నికల సమయం దగ్గర పడ్డాక ఇక అసలు సిసలైన రాజకీయాన్ని మొదలు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు.రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఒక ప్రచారంతో ఒకవేళ హంగ్ ఏర్పడితే కాంగ్రెస్ కీలక పాత్ర పోషించే విధంగా ఉండాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇప్పటికే రేవంత్ పార్టీ కోసం కష్టపడని వారికి పదవులు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో రేవంత్ ఇటు బడ్జెట్ పై, ప్రభుత్వ కార్యకలాపాలపై ఎలాంటి నిరసన విధానాలను రూపొందిస్తారనేది చూడాల్సి ఉంది.ఎందుకంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎక్కువగా ప్రజల్లో ఉంటేనే ఎంతో కొంత మెరుగైన ఫలితాలను సాధించుకునేందుకు అవకాశం ఉంది.