తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయాలు కాక పొట్టిస్తున్నాయి.మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగనుండడంతో ఘాటైన విమర్శ ప్రతివిమర్శలతో హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు.
ముచ్చటగా మూడోసారి అధికారం కోసం బిఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.తొలిసారి అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి.అయితే.అయితే రాష్ట్రంలో త్రిముఖ పోరు గట్టిగానే ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలపై ఇతర పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి.గత కొన్నాళ్లుగా బీజేపీ మరియు బిఆర్ఎస్ మద్య పొత్తు ఉందని కాంగ్రెస్ పార్టీ బలంగా విమర్శలు చేస్తోంది.అటు ఆ రెండు పార్టీలు కూడా మిగిలిన పార్టీలతో ఇదే రకమైన విమర్శలు కొనసాగిస్తున్నాయి.
అయితే తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఓ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
బీజేపీ అధ్యక్ష మార్పులో కేసిఆర్ ప్రమేయం ఉందని, కేసిఆర్ సూచనల మేరకే బండి సంజయ్ ని అధ్యక్షపదవి నుంచి బీజేపీ ఆగ్రనేతలు తప్పిచారని ఇటీవల పదే పదే నొక్కి చెబుతున్నారు.
అయితే ఇందులో నిజం ఎంతమేర ఉందనే సంగతి పక్కన పెడితే.బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తరువాత బీజేపీ పూర్తిగా డీలాపడింది.దీంతో బిఆర్ఎస్ కోసమే బీజేపీ కొంత నెమ్మదించిందనే వార్తలకు బలం చేకూరుతోంది.పైగా కాంగ్రెస్ నేతలపై ఎన్నికల ముందు జరుగుతున్నా ఐటీ దాడులలో కూడా బీజేపీ పార్టీ మరియు కేసిఆర్ ప్రమేయం ఉందనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న మాట.

కాంగ్రెస్ చేస్తున్న ఈ రకమైన విమర్శలు అటు బిఆర్ఎస్ ను గాని ఇటు బీజేపీని గాని ఇరుకున పెట్టెలా ఉండడంతో.ఈ రెండు పార్టీలను హస్తం నేతలు వ్యూహాత్మకంగా డిఫెన్స్ లో పడేసినట్లు తెలుస్తోంది.బిఆర్ఎస్ కు చెక్ పెట్టె విధంగా కాంగ్రెస్ వేస్తున్న ప్రణాళికలు ఈ మద్య గట్టిగానే సక్సస్ అవుతున్నాయి.ఇప్పటికే అటు బిఆర్ఎస్ నుంచి గాని ఇటు బిజెపి నుంచి గాని చాలమంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.
ఇప్పుడు ఈ రెండు పార్టీలను మరింత మరింత ఇబ్బంది పెట్టెలా బీజేపీ అధ్యక్ష మార్పులో కేసిఆర్ ప్రమేయం ఉందనే చర్చ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.