తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ( Minister Ponnala Lakshmaiah )కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే.గత కొంతకాలం నుండి పార్టీ పట్ల అసంతృప్తి నేతగా సాగుతున్న ఆయన శుక్రవారం రాజీనామా చేయటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే సమయంలో పొన్నాల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.పరిస్థితి ఇలా ఉంటే పొన్నాల లక్ష్మయ్య రాజీనామా పరిణామంపై కాంగ్రెస్ ఎంపీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
ఢిల్లీలో( Delhi ) శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.
ఇన్నేళ్లు పదవులు అనుభవించి, ఈ వయసులో పార్టీ మారటానికి సిగ్గుండాలి.చచ్చేముందు ఆయనకు ఏ రోగం వచ్చింది.? పీసీసీ చీఫ్ గా 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పి వెంటనే పొన్నాల తన రాజీనామా ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు.అంతేకాకుండా త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఈసారి ఎక్కువ సీట్లు కేటాయించినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే 50% స్థానాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.