తెలంగాణలో సీఎం ఎంపిక వ్యవహారానికి తెరపడింది.ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయింది.
ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్ లోని ఎల్లా హోటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానంపై పార్టీ సీనియర్ నేతలను కూడా సంప్రదించినట్లు పేర్కొన్నారు.అనంతరం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎంగా నిర్ణయించారని తెలిపారు.
కాగా ఈనెల 7వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.అలాగే వన్ మ్యాన్ షోగా ఉండదన్న కేసీ వేణుగోపాల్ టీమ్ స్పిరిట్ తో పని చేస్తామని స్పష్టం చేశారు.
అనంతరం కేబినెట్ కూర్పు, ప్రధాన మంత్రిత్వ శాఖలపై రేవంత్ రెడ్డికి అధిష్టానం సూచనలు చేయనుంది.అదేవిధంగా పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకోనుంది.
కాగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి కావడం విశేషం.