'టైగర్ నాగేశ్వర రావు' సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో అతనేనా..?

మాస్ మహారాజ రవితేజ( Hero Raviteja ) ఈమధ్య తన రూటుని మార్చి రొటీన్ కి పూర్తిగా బిన్నంగా ఉండే సబ్జక్ట్స్ ని ఎంచుకుంటూ నేటి తరం ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఒకప్పుడు రవితేజ సినిమాలంటే కేవలం మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా రొటీన్ కమర్షియల్ సబ్జక్ట్స్ ఉండేవి.

 Rebel Star Prabhas Missed Tiger Nageswara Rao Movie Chance,rebel Star Prabhas ,t-TeluguStop.com

కానీ అవే మధ్యలో ఆయనకీ డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చేలా చేసి కెరీర్ ని డైలమాలో పడేసింది.అప్పటి నుండి రూటు మార్చిన రవితేజ మారిన తరానికి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.‘ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఆయన ‘రావణాసుర'( Ravanasura ) అనే చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది కానీ, రవితేజ కి మాత్రం మంచి ఇమేజి ని తెచ్చిపెట్టింది.

Telugu Ravanasura, Raviteja, Rebel Prabhas, Tigernageswara, Tollywood-Movie

ఎందుకంటే అంతటి నెగటివ్ షేడ్ యాంగిల్ లో రవితేజ ని ఇది వరకు అభిమానులు మరియు ప్రేక్షకులు చూడలేదు.అందుకే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కూడా కష్టం అయ్యింది.ఇప్పుడు మరోసారి ఆయన ప్రయోగాత్మక పీరియడ్ డ్రామా తో ‘టైగర్ నాగేశ్వర రావు'( Tiger Nageswara Rao ) అనే సినిమాతో మన ముందుకి రాబోతున్నాడు.నిజ జీవితం లో ఒక బందిపోటు దొంగ కి సంబంధించిన కథ ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా అర్థం అవుతుంది.

రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అసలు రవితేజ నుండి ఈ రేంజ్ మేక్ ఓవర్ ఎప్పుడూ ఊహించలేదని ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ సోషల్ మీడియా( Social Media ) లో కామెంట్ చేస్తున్నారు.

ఇది కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపే సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Telugu Ravanasura, Raviteja, Rebel Prabhas, Tigernageswara, Tollywood-Movie

ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రాన్ని తొలుత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Young Rebel Star Prabhas ) తో చెయ్యాలని అనుకున్నారట.ఇప్పుడు పెట్టి తీసిన బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువ బడ్జెట్ పెట్టి , చాలా గ్రాండ్ చెయ్యాలని అనుకున్నాడట నిర్మాత అభిషేక్ అగర్వాల్( Abhishek Agarwal ). కానీ ప్రభాస్ మాత్రం మరో నాలుగేళ్ల పాటు నా డేట్స్ మొత్తం ఖరారు అయిపోయాయి, ఈ సినిమాలు పూర్తి అయ్యేవరకు ఉంటాను అంటే ఉండు, లేదంటే వేరే హీరో తో చెయ్యి అని అన్నాడట.కానీ స్క్రిప్ట్ మాత్రం అదిరిపోయిందని, సరిగ్గా హ్యాండిల్ చేస్తే ఈ చిత్రం అద్భుతాలు సృష్టిస్తుంది అని అన్నాడట.

దాంతో వేరే హీరో తో ఈ సినిమాని చెయ్యాలని అనుకొని పలువురి స్టార్ హీరోలను సంప్రదించారు కానీ డేట్స్ సమస్య .ఇక ఆ సమయం లో రవితేజ ని సంప్రదించిన వెంటనే ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం, స్టోరీ వినిపించడం, వెంటనే ఓకే చెయ్యడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube