ప్రభాస్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.ఒకవైపు క్లాస్ సినిమాలతో మరోవైపు యాక్షన్ సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
సినిమాసినిమాకు హీరోగా ప్రభాస్ రేంజ్ ఎంతగానో పెరుగుతోందనే సంగతి తెలిసిందే.అయితే ప్రభాస్ హీరోగా తెరకెక్కి డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.
ప్రభాస్ సినీ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాలలో చక్రం సినిమా కూడా ఒకటి.
ఎంతోమంది ప్రేక్షకులకు నచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాలోని జగమంత కుటుంబం నాది సాంగ్ అంచనాలకు మించి హిట్ గా నిలిచింది.కథ, కథనంలోని చిన్నచిన్న లోపాలు, క్లైమాక్స్ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉండటం ఈ సినిమా ఫెయిల్యూర్ లో కీలక పాత్ర పోషించాయి.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ వెరైటీ రోల్ లో కనిపించడం కూడా ప్రేక్షకులకు నచ్చలేదు.
అయితే రంగమార్తాండ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కృష్ణవంశీ చక్రం సినిమా ఫ్లాప్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వర్షం సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన తర్వాత ప్రభాస్ కు రెండు కథలు చెప్పానని ఆ కథలలో చక్రం సినిమా ఒకటి కాగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మరో కథ చెప్పానని కృష్ణవంశీ వెల్లడించారు.ప్రభాస్ మాత్రం యాక్షన్ సినిమా వద్దని చక్రం కథకు ఓటేశారని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.

ప్రభాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలో నటించి ఉంటే మాత్రం సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ ప్రస్తుతం యాక్షన్ కథలకే ఎక్కువగా ఓటేస్తున్నారు.ప్రభాస్ నటించిన సలార్ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.