తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి ఇన్ని కారణాలా.. ఆ తప్పులే హ్యాట్రిక్ కు గండి కొట్టాయా?

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ( BRS ) సంచలనాలు సృష్టిస్తుందని అందరూ భావించగా కారు స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి.రాష్ట్రంలో బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకు పరిమితమైంది.

 Reasons Behind Brs Failure In Telangana Elections Details, Brs, Telangana Genera-TeluguStop.com

అర్బన్ ఏరియాలలో, సెటిలర్లు ఉన్న ప్రాంతాలలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు రాగా రూరల్ ఏరియాలలో( Rural Areas ) మాత్రం భిన్నమైన పరిస్థితి ఏర్పడింది.ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది.

అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయాలను అందిస్తాయని భావించిన బీఆర్ఎస్ కు అందుకు భిన్నంగా ఫలితాలు రావడం ఒకింత షాకిచ్చింది.బీఆర్ఎస్ నేతలు చేసిన కొన్ని తప్పులు హ్యాట్రిక్ కు గండి కొట్టాయి.

బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటనే ప్రశ్నకు కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో బీఆర్ఎస్ ఓటమికి అంతకు మించి కారణలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Bc Bandhu, Brs, Brs Mla Candis, Congress, Dharani, Rythu Bandhu, Telangan

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులపై( BRS MLA Candidates ) ఉన్న వ్యతిరేకత ఆ పార్టీకి శాపంగా మారింది.ఓటమికి కారణాలను విశ్లేషిస్తే దళిత బంధు పథకం( Dalit Bandhu Scheme ) అమలు సరిగ్గా జరగకపోవడం ఆ వర్గం వారిలో అసంతృప్తికి కారణమైంది.బీసీ బంధును( BC Bandhu ) ప్రకటించినా ఈ స్కీమ్ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదు.

ఈ ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేదు.

Telugu Bc Bandhu, Brs, Brs Mla Candis, Congress, Dharani, Rythu Bandhu, Telangan

రైతుబంధు స్కీమ్( Rythu Bandhu ) భూస్వాములకు అనుకూలంగా ఉండటంపై విమర్శలు చెలరేగాయి.రుణమాఫీ అమలు విషయంలో తప్పులు, పేపర్ లీకేజీలు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కారం కాకపోవడం కూడా రైతుల్లో అసంతృప్తికి కారణమైంది.గ్రూప్1 పరీక్ష రెండుసార్లు రద్దు కావడం, కాళేశ్వరంపై వ్యతిరేక ప్రచారం కూడా పార్టీకి మైనస్ అయింది.పార్టీ పేరు మార్పు కూడా ఎక్కువమందిలో వ్యతిరేకతకు కారణమైంది.జీ.హెచ్.ఎం.సీ పరిధిలో మాత్రం బీ.ఆర్.ఎస్ కు ఒకింత అనుకూల ఫలితాలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube